దేవుడు అన్ని చోట్లా ఉన్నాడా ..?

Durga
 సోమయ్య తన కొడుకు రామూకు రాత్రి నిద్రపోయ్యేటప్పడు కథలు చెప్పేవాడు. ఓ రోజు అతని కొడుకుతో ఇలా అన్నాడు.  ‘‘ బాబు,  ఓ మాట మాత్రం ఎప్పుడూ మరిచిపోకు. దేవుడు అన్నిచోట్లా ఉన్నాడు సుమా ! రాము అటూ ఇటూ తొంగి చూసి ‘‘  నాన్న భగవంతుడు అన్ని చోట్లా ఉన్నాడా ?  మరి, నాకెక్కడా కనపడటం లేదే ? అన్నాడు ఆశ్చర్యంగా. !  ‘‘ బాబూ, మనం భగవంతుని చూడలేము, కానీ పరమాత్ముడు అన్ని చోట్లావున్నాడు. మనం చేసే అన్ని పనులను గమనిస్తూ వుంటాడు’’ సోమయ్య కొడుక్కి చెప్పాడు. రాము తండ్రి చెప్పిన మాటలను జాగ్రత్తగా విన్నాడు. కొద్దిరోజుల తర్వాత కరువు వచ్చిపడింది. సోమయ్య పొలాల్లో ఏమి పండలేదు, ఓ రాత్రి సోమయ్య కొడుకును వెంటబెట్టుకొని ఊరవతలి పొలానికి వెళ్లాడు. ఆ పొలం మరో రైతుది. ఎవ్వరికీ తెలియకుండా ఓ మోపు వరికంకులు కోసి, ఇంటికి తెచ్చుకోవాలని సోమయ్య పథకం. పొలం గట్టుమీద రామూని నిలబడమని, ‘‘ నీవు నాలుగు దిక్కుల్లా జాగ్రత్తగా చూస్తూవుండూ ఎవరైనా అటు ఇటూ కనపడితే నాకు చెప్పు’’ అని సోమయ్య కొడుక్కి చెప్పాడు. సోమయ్య పొలంలో వరికంకులు కోసేందుకు దిగాడో లేదో రాము ‘‘ నాన్నా ఆగండి’’ అన్నాడు. ‘‘ ఎవరైనా చూస్తున్నారా ఏం ’’? సోమయ్య అడిగాడు. రాము ‘‘ అవును నాన్నా చూస్తున్నారు.’’ సోమయ్య పొలంలో నుంచి గట్టుమీదకి వచ్చాడు. నలువైపులా చూస్తే అతనికి ఎవరూ కనపడుట లేదు. అప్పుడు అతను కొడుకును అడిగాడు. ‘‘ ఎక్కడ ? ఎవరూ అగపడటం లేదే ?’’ రాము ‘‘ దేవుడు అన్నిచోట్లా ఉన్నాడు. అందరు చేసేపనులు గమనిస్తూ వుంటాడని మీరే చెప్పారుగా ! అలాంటప్పుడు మీరు వరికంకులు కోస్తూవుంటే, దేవుడు చూరడుండా వుంటాడా?’’ సోమయ్య కొడుకు మాటలు విని సిగ్గూతో తలవొంచాడు. దొంగతనం చెయ్యకుండా కొడుకుతో కలిసి ఇంటికి వెళ్లాడు. ఈ కథలోని నీతి : దేవుడున్నాడు జాగ్రత్తా !

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: