ప్రఖ్యాత ఉద్యమకారుడు స్వాతంత్ర్య సమర యోధుడు

Durga
భగత్ సింగ్ స్వాతంత్ర్య సమర యోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు, ఈ కారణంగానే ‘‘ షహీద్ భగత్ సింగ్ గా కొనియాడాబడతాడు. చరిత్రకారుడు కె.ఎన్.పనిక్కర్ ప్రకారం భగత్ సింగ్, భారతదేశంలో ఆరంభ మార్కిస్టు, భగత్ సింగ్ హిందుస్థాన్ సోషియలిస్టు రిపబ్లికన్ పార్టీ స్థాపక సభ్యల్లో ఒకరు ఇప్పడు పాకిస్తాన్ లో ఉన్న లాయల్ జిల్లా బంగా గ్రామంలో భగత్ సింగ్ జన్మించాడు.  బాల్య , జీవితం భగత సింగ్ మూడేళ్ళ పిల్లాడిగా ఉన్నపుడు అతిన తండ్రి కిషన్ సింగ్ భగత్ సింగ్ ను చంకకెత్తుకొని, తన స్నేహితుడు నందకిశోర్ మెహతాతో పాటు కొత్తగా వేస్తున్న తోటను చూడ్డానికి పొలాల్లోకి వెళ్లాడు. వెంటనే కిందకి దిగిన భగత్ సింగ్ ఆ మట్టిలో ఆడుకుంటూనే చిన్న చిన్న గడ్డిపరకలను నాటడం మొదలు పెట్టాడు.  తండ్రి ’’ఏం చేస్తున్నావ్ నాన్నా‘‘ అని ప్రశ్నిస్తే... భగత్ సింగ్ ఇచ్చిన జవాబు విని వాళ్లు అవాక్కయ్యారు. భగత్ సింగ్ అన్న మాటలివి ‘‘ తుపాకులు నాటుతున్నా’’ భవిష్యత్తుకు బాల్యమే బాల్యమే మొలక, మొలకలు వేసే వయసులో తుపాకును మొలకెత్తించాలని చూడడం అతని వ్యక్తిత్వానికి మచ్చుతునక విద్యార్థి దశలో స్కూల్లో కూడా ఆటపాటల్లోనే కాదు అందరిలో కలివిడిగా ఉండేవాడు.  భగత్ సింగ్  బాబాయి సర్థార్ అజిత్ సింగ్ ఆంగ్లేయులతో పోరాడుతూ విదేశాల్లో ఉంటున్న సమయంలో కంట నీరు పెట్టుకొనే చిన్నమ్మ హర్నామ్ కౌర్ ను చూసి నాలగేళ్ళ భగత్ సింగ్ ‘‘ పిన్ని ఏడవద్దు, నేను ఆంగ్లేయులపై ప్రతీకారం తీర్చుకుంటా’’ అని ప్రతిజ్ఞలు చేసేవాడు. ఉరిశిక్ష ఖాయమన్న సంగతి తెలిసిన తర్వాతే కాదు అతకు ముందు నుంచి కూడా కటకటాల వెనకాల భగత్ సింగ్ ఒక అధ్యయనశీలిగా కాలాన్ని గడిపాడు. రాజనీతి, అర్థశాస్త్రం, సామాజిక శాస్త్ర విషాయాలను ప్రభోదించే అనేక గ్రంధాలను ఆయన అధ్యయనం చేశాడు.  పుస్తకం చదువుతూ మధ్యలో హఠాత్తుగా లేచి అటూ ఇటూ తిరుగుతూ, విప్లవకారుడు రాంప్రసాద్ భిష్మిల్ వ్రాసిన ఈ పాటను పాడేవాడు. మేరా రంగ్ దే బసంతీ వోలాఇసీ రంగ్ మే రంగ్ కే శివానే, మాకా బంధన్ ఖోలా మేరా రంగ్ దే బసంతీ చోలా యహీ రంగ్ హల్ధీ ఘాటీ మే, ఖుల్ కర్కే థా ఖేలా సఫ్ బసంత్ మే, భారత్ కే హిత్ వీరోంకా యహ్ మేలా మేరా రంగ దే బసంతీ చోలా గంభీరమైన గొంతుతో భగత్ సింగ్ పాడుతున్న ఈ పాటను విని జైలు వార్డర్లు కూడా ముగ్ధులయ్యేవారు. ఆదర్శాలు - అభిప్రాయాలు  అసెంబ్లీపై బాంబు విసిరేసిన సంఘటనకి కాస్త ముందుగా తన సహచరుడు సుఖ్ దేవ్ కు రాసిన లేఖలో భగత్ సింగ్ ‘‘ నాకూ ఆశలూ, ఆంక్షలూ ఉన్నాయి. ఆనందమైన జివనం గడపాలని ఉంది అయితే అవసరమైనపుడు వీటన్నిటినీ త్యజించగలను ఇదే అసలైన బలిదానం’’ అలా స్వంగ్రామంలో ప్రాణాలు బలిదానం చేసిన మహ గొప్ప వీరుడు!  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: