చెట్టు మీద నుంచి ఆపిల్ పండు భూమి మీదే పడుతుంది. ఆకాశంలోకి ఎగరదు. ఎందుకంటే, భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది. ఈ విషయాన్ని కనిపెట్టింది న్యూటన్. మరి, ఆయన గురించి తెలుసుకుందామా .. ఇంగ్లండ్ లోని ఒక మారుమూల గ్రామం వూల్స్ తార్ప్ అనే ఊర్లో 1642, డిసెంబరు 25న న్యూటన్ జన్మించాడు. ఆయన చిన్నతనం అంతా కష్టాలతోనే గడిచింది. చిన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోయారు. అందుకని చదువు సరిగ్గా సాగలేదు. అష్టకష్టాలు పడి హైస్కూలు చదువు వరకూ నెట్టుకొచ్చాడు. గుడ్డి దీపం ముందు పెట్టుకుని అర్థరాత్రి వరకూ చదివేవాడు. చదువు మీద న్యూటన్ కు ఉన్న శ్రద్ధను అతని మేనమామ కనిపెట్టాడు. కేంబ్రిడ్జి లోని ట్రినిటీ కాలేజీలో చేర్పించాడు. అక్కడ న్యూటన్ ఎంతో బాగా చదువుకుని మంచి పేరు తెచ్చుకున్నాడు. చదువు పూర్తయ్యాక అదే కాలేజీలో లెక్చరర్ గా చేరాడు. రాయల్ సొసైటీలోని రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త సహాయంతో పరిశోథనలు చేయడం ప్రారంభించాడు. అప్పుడే గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనుగొన్నాడు. గణితం లోనూ, ఫిజిక్స్ లోనూ గొప్ప శాస్త్రవేత్తగా పేరు తెచ్చుకున్నాడు. న్యూటన్ కు పరిశోధనలతో పాటు పెంపుడు జంతువులను కూడా ప్రాణంగా ప్రేమించాడు. ఎంత ప్రేమ అంటే ఒకసారి తాను ఎంతో కష్టపడి పరిశోధన చేసిన ఫలితాలు రాసుకున్న పేపర్లను పెంపుడుకుక్క చింపేసినా, దాన్ని కోపంగా ఒక్క మాట కూడా అనలేదు. అంత ప్రేమ జంతువులంటే. మనకు సౌకర్యాలు ఉన్నా, లేకపోయినా బాగా కష్టపడి చదువుకుంటే ప్రపంచం మనని గుర్తిస్తుంది. మనం గొప్పవాళ్ళం అవుతామని న్యూటన్ జీవితం నుంచి నేర్చుకోవాల్సిన విషయం. న్యూటన్ తన 85వ సంవత్సరంలో అంటే 1727లో మరణించాడు.
మరింత సమాచారం తెలుసుకోండి: