బుడుగు: కరోనా నుంచి పిల్లల్ని ఇలా కాపాడుకోండి..!

N.ANJI
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారి నుండి ప్రజలను కాపాడేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే కరోనా కారణంగా అనేక మార్పులు వచ్చాయి. సాధారణంగా అయితే పిల్లలు స్కూల్‌కి వెళ్ళినప్పుడు చాలా క్రమశిక్షణతో మెలుగుతూ ఉంటారు. ఇక ఆన్ లైన్ క్లాసులు కారణంగా ఎక్కువ సేపు కంప్యూటర్ వద్ద ఉండడం.. తల్లిదండ్రులు నిజంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ముఖ్యంగా వాళ్ళల్లో ప్రవర్తన మారినప్పుడు, ఎక్కువగా అల్లరి చేసేటప్పుడు కంట్రోల్ చేయలేక తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
ఇక చాలా మంది పిల్లలు కంప్యూటర్ ముందు కూర్చుని నేర్చుకోవడం చాలా మార్పు తీసుకువచ్చిందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక పాఠశాల అంటే కేవలం తరగతులు నడిపించడం, పాఠాలు బోధించడం మాత్రమే కాదన్నారు. అయితే పిల్లల యొక్క ఎమోషనల్ స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్ కూడా వాళ్ళు హ్యాండిల్ చేసేలాగా మార్చాలన్నారు. ఇక పిల్లలు స్కూల్‌లో వీటిపై చాలా వరకు శ్రద్ధ పెడతారని ఎప్పటికప్పుడు మీటింగ్స్ కండక్ట్ చేస్తారని స్కూల్ డైరెక్టర్స్ అన్నారు. ఇక  ఎకడమిక్‌ పరంగా మాత్రమే కాకుండా పర్సనల్‌గా, ఎమోషనల్‌గా వాళ్ళు ప్రతిదీ షేర్ చేసుకుంటారని అన్నారు. అంతేకాదు.. వాళ్ళ యొక్క ఇబ్బందులని కూడా వాళ్ళు క్లియర్‌గా పంచుకుంటారు.
ఇక వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క భావాలని పంచుకుంటూ ఉంటారని వాళ్లకి ఎదురయ్యే ప్రతి సమస్యను కూడా వాళ్ల మెంటర్‌కి చెబుతారని అన్నారు. అయితే పిల్లలు జీవితంలో పైకి రావాలంటే పాఠశాల దశ చాలా ముఖ్యం. బెంగళూరులో అయితే చైల్డ్ సైకాలజిస్ట్ ఉంటారని ఆయన అన్నారు. ఇక పైగా వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ అని.. వాళ్ళు పిల్లల్ని హ్యాండిల్ చేస్తారని తెలిపారు.

అయితే మానసిక ఆరోగ్యం, బిహేవియర్ హెల్త్ పట్ల శ్రద్ధ తీసుకుంటారు. స్కూల్ వైస్ ప్రిన్సిపల్, మ్యాథ్స్ టీచర్ జ్యోతి వాళ్ల గురించి ఏం చెబుతున్నారంటే.. మేము విద్యార్థులని బట్టి థెరపీని అందిస్తున్నట్లు తెలిపారు. దీని వలన హెల్దీ పియర్ రిలేషన్ షిప్ కూడా వాళ్ళల్లో ఉంటాయని తెలిపారు. అలానే ఆత్మహత్య వంటివి చేసుకోకుండా ఉండడానికి ఆక్టివిటీస్ లాంటివి కూడా నిర్వహిస్తామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: