తెలంగాణ: ఈ ఆలయంలో అడుగుపెడితే కోటీశ్వరులే.. ఎక్కడంటే?

Veldandi Saikiran

మనదేశంలో అనేక శివాలయాలు ఉన్నాయి. ఢిల్లీ నుంచి గల్లి వరకు లయకారుడైన శివయ్య ఆలయాలు అనేకం ఉన్నాయి. శివుని ఆదేశం లేనిదే చీమైనా కుట్టదని మన పెద్దలు చెబుతుంటారు. అందుకే ఏ రాష్ట్రంలో అయినా శివాలయాలు కచ్చితంగా మనకు కనిపిస్తాయి. అమర్నాథ్, భోలేనాథ్, కైలా సనాధుడు, కాశీ విశ్వనాథుడు, కేదార్ నాథుడు, సోమనాథుడు, బద్రీనాథ్, అమర్నాథ్ స్వామితో పాటు ఇంకా అనేక పేర్లు శివయ్య కు ఉన్నాయి. ఇక ఎన్నో పురాతన శివాల యాలలో ఒకటి తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా గూడూరులో కాకతీయ కాలంనాటి అతి పురా తనమైన శివాలయం ఉంది. సాధారణంగా మహాశివరాత్రి రోజు ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోతాయి.

అలాగే ఈ గూడూరు లోని కాకతీయుల కాలం నాటి అతి పురాతనమైన ఆలయానికి కూడా ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున శివ భక్తులు తరలి వస్తుంటారు. మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ మండలం గుండం గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి కాకతీయులనాటి శివాలయం ఇది. ఈ శివాలయం విశిష్టత ఏంటంటే.. ఇక్కడ కొలువైన శివుడికి రెండు గర్భాలయాలు ఉంటాయి. ఓ గర్భగుడిలో ఆ పరమేశ్వరుడు విగ్రహ రూపంలో భక్తులకు దర్శనం ఇస్తే.. మరో గర్భగుడి లో లింగ రూపంలో భక్తులను కటాక్షిస్తుంటాడు.
శివరాత్రి రోజు ఇక్కడి స్వామివారికి అభిషేకం చేస్తే ఎంతటి గండాలైనా తొలగిపోతాయని.. "గుండం రాజేషున్ని కొలిస్తే గండాలు తీరుస్తాడని" ఇక్కడి ప్రజల నమ్మకం. అంతేకాదు ఈ ఆలయాన్ని దర్శించిన వారు... కోటీశ్వరులు కూడా అవుతారట. డబ్బులు విపరీతంగా సంపాదిస్తారట. ఈ ఆలయంలో అడుగు పెట్టగానే... ఆర్థిక సమస్యలు తొలగిపోతాయట.  ఇలాంటి దేవాలయం మన  తెలంగాణ రాష్ట్రంలో మరెక్కడా లేదని చరిత్రకారులు చెబుతున్నారు. మీరు కూడా ఇక్కడి శివయ్య ను దర్శించుకుని ఆ మహాశివుని కటాక్షాన్ని పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: