కుక్కలు ఏడుస్తున్నాయా.. చావు తప్పదా.. ఎందుకో తెలుసా.. "

MOHAN BABU
 మన భారతదేశంలో  మూఢవిశ్వాసాలు అనేవి పురాతన కాలం నుంచి వస్తున్నాయి. మనం కూడా ప్రస్తుతం వాటిని నమ్ముతున్నాం. శకునాలు, తిధులు అని అనేక విషయాలు నమ్మడమే కాకుండా ఆచరిస్తున్నారు కూడా. ఏదైనా పనిమీద వెళ్లేటప్పుడు  అనుకోని సంఘటన జరిగితే మనం దానిని శకునంగా  భావిస్తాం. ఇందులో మంచి చెడులు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందామా..?

 పాల శకునం : మనం ఏదైనా కొత్త ఇండ్లు గృహప్రవేశ సమయంలో, పాలను పొంగించడం మంచిదాని అనుకుంటాం. అదేవిధంగా వంట చేసే ఇంట్లో పాలు కింద పడితే దాన్ని కొంతమంది అశుభంగా భావిస్తారు.

 గాజు పగలడం : గాజు పగిలిపోవడం అనేది కూడా ఒక శకునంగా భావిస్తారు. దీన్ని చెడ్డ శకునం అంటారు. కొన్ని సమయాల్లో మనం అనుకోకుండానే కొన్ని గాజు వస్తువులు పలిగి పోతూ ఉంటాయి. అయితే అది ఏవిధంగా పగిలినా దాని అర్థం కుటుంబంలో ఏదో ఇబ్బంది రాబోతుందని సందేశం ఇస్తుంది. ఇలాంటివి జరిగినప్పుడు భగవంతున్ని ప్రార్థిస్తే  మంచి జరుగుతుందట.

 చీపురు: మన ఇంట్లో ఉండే చీపిరిలో మహాలక్ష్మి దేవి ఉంటుందని  పెద్దలు భావిస్తారు. అందుకోసమే చీపురుపై  మహిళలు కాలు పెట్టరాదని అంటుంటారు. దీంతోపాటుగా సూర్యాస్తమయం అయిన తర్వాత ఇంటి నుండి చెత్తను పడేస్తే అరిష్టమని భావిస్తారు. ఆ చీపురు కూడా ఎవరికీ కనిపించనటువంటి ప్రదేశంలో ఉంచాలి అని చెబుతుంటారు.

 కుక్క మరియు పిల్లి ఏడుపులు : మన చుట్టు పక్కల కుక్కలు లేదా పిల్లులు  ఏడిస్తే దాన్ని కూడా చెడు శకునంగా భావిస్తారు. ఇవి ఏడ్చినప్పుడు ఎవరో చనిపోతారని భావిస్తుంటారు.

 తుమ్ములు: మీరు ఎప్పుడైనా ఇంటి నుంచి బయటకు వెళ్లేముందు తుమ్ములను చెడు శకునం గా భావిస్తారు. ఎవరైనా తుమ్మి నట్లయితే కాసేపు ఆగి వెళ్లాలని పెద్దలు చెబుతుంటారు. ఏది ఏమైనా ఇంత టెక్నాలజీ పెరిగిన ఇలాంటి శకునాలు భారత దేశంలో ఇంకా నడుస్తూనే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: