వెటాడబడ్డవాళ్ళు రాసిందే.. చరిత్ర..!

MOHAN BABU
ప్రజల మెదళ్లను  ఆధీనంలో ఉంచుకోవడానికి ప్రతి సంవత్సరం వందల బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నారని కుండబద్దలు కొట్టి చెప్పాడు నొమ్ చాస్కి కొందరు దేవున్ని మొక్కుతారు. మరి కొందరు పశువుల్ని, పక్షుల్ని,వృక్షాల్ని పూజిస్తారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను మాత్రం బజారుపాలు చేస్తున్నారు. అన్నం,నీళ్లు ఇవ్వకుండా బలవంతంగా చంపేస్తారు. ఆధ్యాత్మికంగా కాదురా బాబు సామాజికంగా ఆలోచించండి అని చెప్పాలనిపిస్తుంది. క్రీస్తు జన్మదినంగా చెప్పబడే డిసెంబర్ 25 కూడా శ్రీరామనవమి,శ్రీ కృష్ణ జన్మాష్టమి లాగా ఊహాజనితమైందేనని నిర్ధారణ జరిగిందని తెలుసుకుంటే ఆశ్చర్యకరమైన విషయం ఏటంటే, మోస పోవడానికి సిద్ధంగా మహిళలే ఎక్కువగా ముందుకొస్తున్నారు. మతం పేరుతో కోట్లకు కోట్లు వెనకేసుకున్న ఆధ్యాత్మిక వ్యాపారస్తులను నమ్మి సామాన్య జనం ధన, మాన,ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

అలా డబ్బు ఖర్చు చేయడం మాని అదే డబ్బుతో కనీసం జీవిత బీమా చేయించుకున్న వారికి లాభదాయకంగా ఉంటుంది.వారి మరణానంతరం వారి కుటుంబ సభ్యులైనా సుఖపడతారు. ఏ తల్లిదండ్రులు అయినా వారి జీవితకాలంలో ఏ దేవున్ని ప్రత్యక్షంగా చూసి ఉండరు. అయినా తమ పిల్లలకు అదిగో జేజ, దేవుడు దండం పెట్టు అని అబద్దాలతో మౌఢ్యం ఊబిలోకి తోసేస్తారు. ఇక అంతే వారు జీవిత కాలం అలానే మూఢభక్తి లో కొట్టుకు చస్తుంటారు. దీనికి బెట్రండ్ రసెల్ సరైన వివరణ ఇచ్చారు. భయాల మీద ఆధారపడిందే మతం..!

చావు భయం,ఓటమి భయం,ఎన్నెన్నో తప్పిదాల భయం, పొరపచ్చాల భయం. ఈ భయానికి పుట్టిందే క్రూరత్వం. నేను మతాన్ని భయానికి పుట్టిన రోగంగా పరిగణిస్తాను. అంతేకాదు మానవజాతికి దాపురించిన ఒక చెప్పలేని దుస్థితిగా భావిస్తాను అని అగ్రవర్ణాలు -నిమ్నవర్గాల్ని,తెల్ల వాడు -నల్ల వాణ్ని, ఉన్న వాడు- లేనివాన్ని, పురుషుడు -మహిళను నిరంతరం వేటాడే పనిని అడ్డుకోవాల్సిందే. వేటడపడ్డ వాళ్ళు తిరగబడుతున్నారు. కాలం తిరగబడుతుంది.మానవత్వ- సమానత్వపు గాలులు వీస్తున్నాయి. ఈ విధంగా చరిత్ర సమానత్వం అనే వాటి మీద ఆధారపడి నడుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: