తెలంగాణ సాయుధ పోరాట నిప్పుక‌ణం చాక‌లి ఐల‌మ్మ‌..

Paloji Vinay
ఐల‌మ్మ తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వీర వ‌నిత‌. నిజాంకు వ్య‌తిరేకంగా దున్నెవాడిదే భూమి అంటూ భూ పోరాటానికి ఊపునిచ్చింది. ఐలమ్మ భూ వివాదంలో ఓటమి పాలైన దేశ్ ముఖ్ రామచంద్రారెడ్డి పాలకుర్తిపై అనేకసార్లు దాడులు చేశాడు. ఐల‌మ్మ పొలాల్లొకి ఆ దొర గుండాల‌ను పంపించి పంట న‌ష్టం చేయాల‌ని చూశారు కానీ ఐల‌మ్మ రోక‌లిబండ ప‌ట్టుకుని వారిపై తిర‌గ‌బ‌డింది దీంతో దొర తోక‌ముడిచి వ‌చ్చిన దారినే వెనుదిరిగాడు. నైజాం కొమ్ముకాస్తున్న దొర‌లు ప్ర‌జ‌ల ప‌ట్ల రాక్ష‌సులుగా మారారు. వంతు పెట్టుకుని మ‌రీ గ‌డీల్లో వెట్టి చాకిరీ చేయించేవారు బ‌డుగుబ‌ల‌హీన వ‌ర్గాల చేత‌.
      అయితే, వారి అర‌చ‌కాల‌ను, రాచ‌రికం అంత‌మొందే స‌మ‌యం ఆస‌న్న‌మైంది వారి భారంగా అనుకున్న భూత‌ల్లి వీరుల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఆ పోరు బిడ్డ‌ల్లో చాక‌లి ఐల‌మ్మ ఒక‌రు. 1895 లో వ‌రంగ‌ల్ జిల్లా జ‌న‌గామ తాలూకాలోని కిష్టాపురం గ్రామంలో జ‌న్మించింది చాక‌లి ఐల‌మ్మ ఆమె అస‌లు పేరు చిట్యాల ఐల‌మ్మ‌. ప‌దేళ్ల వ‌య‌సులోనే పెళ్లి జ‌రిగింది పాల‌కుర్తికి చెందిన చిట్యాల న‌ర్స‌య్య‌తో. ఆమెకు ఐదుగురు కుమారులు, ఇద్ద‌రు కూతుళ్లు కావ‌డంతో బ‌ట్ట‌లు ఉతికి తెచ్చిన గట్క వారికి సరిపోయేది కాదు. దీంతో విస్నూరు దొర ద‌గ్గ‌ర రెండు ఎక‌రాల‌ను క‌వులుకు తీసుకుని పంట‌పండించుకునేది. ఇలా వారి ద‌గ్గ‌ర క‌వులు తీసుకున్న వాళ్లంద‌రు గ‌డీల్లో వెట్టి చాకిరీ చేయ‌క తప్పేది కాదు.
  ఈ క్ర‌మంలో  జ‌న‌గామ  తాలుకాలో ఆరుట్ల రాంచంద్రారెడ్డి నాయ‌క‌త్వంలో  ఆంధ్ర మ‌హాస‌భ, క‌మ్యూనిస్టు పార్టీలో ఊరూరా తిరుగుతు ప్ర‌జ‌ల్లో చైత‌న్యం క‌లిగించేవారు. ఈ క్ర‌మంలో ఐల‌మ్మ కొడుకు ఆ సంఘంలో చురుకుగా పాల్గొనే వాడు. దీంతో ఆ కుటుంబంపై క‌క్ష్య క‌ట్టిన విస్నూర్ దొర రాంచంద్రారెడ్డి వారి పంట‌ను లాక్కోవాల‌ని చూడ‌డంతో వారిపై సివంగిలా దూకీ క‌మ్యూనిస్టుల సహాయంతో హెచ్చిరంచింది చాక‌లి ఐల‌మ్మ‌. ఆమె తెగింపు చుట్టూ ప‌క్క‌ల ఉన్న గ్రామాల‌కు పాక‌డంతో ఎదురిస్తే ఆపే వారుండరు అనే సంకేతం వెళ్లింది.  

       సాయుధ పోరాటంలో ఆమె త‌న భ‌ర్తను కుటుంబాన్ని పోగొట్టుకుంది అయినా మొక్క‌వోని దీక్ష‌తో దొర‌ల పాల‌నకు వ్య‌తిరేకంగా పోరాటం ఆప‌లేదు. దొర‌ల ముందు క‌నీసం నిల‌బ‌డ‌లేకుండా.. నీ భాంచ‌న్ కాళ్లు మొక్కుతా అని త‌ల‌కిందికి వేసుక‌న్న ప్ర‌జ‌ల చేత బందూకులు ప‌ట్టించిన ధీర వ‌నిత చాక‌లి ఐల‌మ్మ 1985 సెప్టెంబ‌ర్ 10న త‌న మ‌న‌వారి ఇంట్లో శ్వాస విడిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: