నేడు కాళోజి జ‌యంతి : ప్ర‌జ‌ల భాషే ఆయ‌న క‌లం..

Paloji Vinay
పుట్టిక నాది జీవిత‌మంతా తెలంగాణ‌ది అని నిన‌దించిన మ‌హామ‌నిషి కాళోజి నారాయ‌ణ‌రావు. తెలుగు భాషను ధ్యాసగా, తెలంగాణ మాండలికాన్ని శ్వాసగా బతికిన కవితా కిరణం ఆయ‌న‌. సామాన్య ప్ర‌జ‌లు మాట్లాడే ప‌దాల‌నే ఆయ‌న అక్ష‌రాలుగా మ‌లిచి ఎన్నోపుస్త‌కాల‌కు జీవం పోశాడు. ఆయ‌న క‌లం నుంచి జారీన ప్ర‌తి అక్ష‌రం ప్ర‌జ‌ల నోటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ప‌దాలే. ఆయ‌న ర‌చ‌న‌ల్లో తెలంగాణ‌త‌నం, పల్లెటూరి అమాయ‌త్వకం క‌నిపిస్తుంది. ఇలా ప్ర‌జ‌ల భాష‌ను ఆయ‌న క‌లంగా మార్చుకున్న మ‌హా మ‌నిషిగా తెలంగాణ ప్ర‌జ‌ల గెండెల్లో నిలిచిపోయారు. ఆయ‌న చేసిన భాషా సేవ‌కు గాను తెలంగాణ ప్ర‌భుత్వం కాళోజి జ‌యంతిని తెలంగాణ భాషా దినోత్స‌వంగా ప్ర‌క‌టించింది.
 
      ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌న‌ అనంత‌రం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది తెలంగాణ‌. అంత వ‌ర‌కు తెలంగాణ యాస‌ను, భాష‌కు, మాండ‌లికానికి ఊపిరిలూదిన క‌వి కాళోజి నారాయ‌ణ రావు. దీంతో ఆయ‌న‌ను ప్రతి ఏటా స్మరించాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో ఆయ‌న జ‌యంతి రోజు అయిన సెప్పెంబ‌ర్ 9 వ తేదిని తెలంగాణ భాషా దినోత్స‌వంగా 2014న ప్ర‌క‌టించింది. ఈ రోజున‌ పాఠశాలలో విద్యార్థుల‌కు తెలంగాణ భాషా సంస్కృతిపై వ్యాస రచనపోటీలు, చర్చా వేదికలు నిర్వహిస్తారు. భావితరాలకు తెలంగాణ భాష, మాండలికాలను అందించేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన త‌రువాత భాషా, సంస్కృతిక రంగాల్లో విశేష సేవలందించిన వారికి కాళోజీ స్మారక పురస్కారాలను అందిస్తోంది ప్ర‌భుత్వం.

   కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని ఆయన పేరిట ఇచ్చే పురస్కారానికి ఈ ఏడాది సాహితీవేత్త పెన్నా శివరామకృష్ణను ఎంపిక చేసింది తెలంగాణ ప్ర‌భుత్వం. ఈ పుర‌స్కారంతో పాటు రూ.1,01,116 నగదు బహుమతిని అందిస్తారు. శివ‌రామ‌కృష్ణ న‌ల్గొండ జిల్లా ద‌గున‌ప‌ల్లికి చెందిన‌వాడు. అధ్య‌ప‌కునిగా ప‌నిచేసి ప‌ద‌వీ వీర‌మ‌ణ చేశారు. ఆయ‌న ర‌చించిన సంక‌లానాలు అలల పడవల మీద, జీవనది, జీవఖడ్గం, నిశ్వబ్ధం నా మాతృక, తెలంగాణ రుబాయిలు, తెలంగాణ సంస్కృతి వంటి వాటిని ప్ర‌చురించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: