సెప్టెంబర్ 6 : చరిత్రలో ఈ నాటి ముఖ్య సంఘటనలు..

Purushottham Vinay
 చరిత్రలో ప్రతి రోజుకి కూడా ఎంతో ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి చరిత్రలో ప్రతి రోజు గురించి కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇక చరిత్రలో ఈ రోజు జరిగిన సంఘటనలు, జాననాలు ఇంకా మరణాల గురించి తెలుసుకోండి.
చరిత్రలో ఈ నాటి ముఖ్య సంఘటనల విషయానికి వస్తే..
1968 వ సంవత్సరంలో స్వాజీలాండ్ స్వతంత్ర దేశంగా అవతరించడం జరిగింది.
2018 వ సంవత్సరంలో తెలంగాణ అసెంబ్లీ రద్దు చేయబడటం జరిగింది.
చరిత్రలో ఈ నాటి జాననాలా విషయానికొస్తే..
1766 వ సంవత్సరంలో జాన్‌ డాల్టన్ పరమాణు సిద్ధాంతానికి పునాదులు వేసిన బ్రిటీష్ శాస్త్రవేత్త జన్మించడం జరిగింది.
1892 వ సంవత్సరంలో సర్ ఎడ్వర్డ్ విక్టర్ ఏపిల్టన్, నోబుల్ బహుమతి గ్రహీత జన్మించడం జరిగింది.
1936 వ సంవత్సరంలో అద్దేపల్లి రామమోహన రావు జన్మించడం జరిగింది. ఈయన తెలుగు కవి, సాహితీ విమర్శకుడు ఇంకా మార్క్సిస్టు.
1950 వ సంవత్సరంలో గండ్లూరి దత్తాత్రేయశర్మ జన్మించడం జరిగింది. ఈయన సుప్రసిద్ధ అవధాని.
చరిత్రలో ఈ రోజు జరిగిన మరణాల విషయానికి వస్తే..
1966 వ సంవత్సరంలో ఆవుల గోపాలకృష్ణమూర్తి మరణించారు. ఈయన హేతువాది ఇంకా రాడికల్ హ్యూమనిస్టు.
ఇక 1996 వ సంవత్సరంలో తూమాటి దొణప్ప మరణించారు. ఈయన ఆంధ్ర, నాగార్జున విశ్వవిద్యాలయాలలో తెలుగు ఆచార్యులు అలాగే తెలుగు విశ్వవిద్యాలయం మొట్టమొదటి ఉప కులపతి.
1998 వ సంవత్సరంలో జపనీస్ సినీ దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత ఇంకా ఎడిటర్ అకీరా కురొసావా మరణించారు.
ఇక 2005 వ సంవత్సరంలో పెరుగు శివారెడ్డి మరణించారు. ఈయన ఆంధ్రప్రదేశ్ లోని ఒక ప్రఖ్యాత నేత్రవైద్య నిపుణుడు.
2012 వ సంవత్సరంలో చెరుకూరి సుమన్ మరణించారు. ఈయన బుల్లితెర రచయిత, నటుడు, దర్శకుడు, చిత్రలేఖకుడు, సినీ నటుడు.
2017 వ సంవత్సరంలో కొమ్ము పాపయ్య మరణించారు. ఈయన శాసన సభ్యుడు.

ఇక ఇవి చరిత్రలో జరిగిన ముఖ్య సంఘటనలు.. కాబట్టి వీటిని తెలుసుకోవడం చాలా ముఖ్యం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: