కలల భారతం: దేశ ప్రజలందరికీ విద్యుత్..రోడ్డు రవాణా సౌకర్యం..?

Pulgam Srinivas
రవి అస్తమించని బ్రిటిష్ పాలన నుండి భారతదేశానికి విముక్తి లభింఛి నేటితో 74 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను త్యాగం చేసి బ్రిటిష్ ప్రభుత్వం పై చేసిన పోరాటం ఫలితంగా 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. దీనితో ఆదివారం దేశ వ్యాప్తంగా 75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అందరూ జాతీయ జెండాను ఎగురవేసి స్వతంత్రం కోసం ప్రాణాలర్పించిన యోధులను స్మరించుకుంటున్నారు. ఇలా దేశం కోసం ప్రాణాలను అర్పించిన స్వాతంత్ర సమరయోధులు దేశానికి స్వతంత్రం వచ్చినట్లయితే దేశ పౌరులంతా సుఖసంతోషాలతో ఉంటారు అని భావించారు.

 మరియు ఒక వ్యక్తికి కనీస అవసరాలు అయినటువంటి విద్య , వైద్యం , కరెంట్ , రవాణా , ఉపాధి అవకాశాలు అన్ని కూడా స్వతంత్రం వల్ల మాత్రమే మన దేశ పౌరులకు అందుతాయని వారు భావించారు. మరి దేశం కోసం స్వతంత్రం కోసం ప్రాణాలర్పించిన వారు అనుకున్నవన్నీ ప్రస్తుతం దేశ పౌరులకు అందుతున్నాయా అని అడిగితే ఏమీ చెప్పలేని పరిస్థితి.. స్వతంత్ర సమరయోధులు దేశానికి స్వతంత్రం వచ్చినట్లయితే పౌరులకు అందాలి అనుకున్న ముఖ్య వసతుల్లో కరెంట్ మరియు రోడ్డు రవాణా కూడా ముఖ్యమైనవే.. మరి ప్రస్తుతం దేశ పౌరులందరికీ మెరుగైన రవాణా సౌకర్యం మరియు విద్యుత్ లభిస్తుందా అంటే అవునని చెప్పలేం అలా అని కాదు అని కూడా చెప్పలేం.  కొన్ని ప్రాంతాలలో ఉన్న వారికి మెరుగైన రవాణా సౌకర్యం మరియు ఎలాంటి ఇబ్బంది లేని విద్యుత్ సౌకర్యాలు అందుకున్నప్పటికీ , మారుమూల ప్రాంతాలలో నివసించే వారికి మాత్రం ఈ వసతులు అంతగా లేవనే చెప్పవచ్చు.  ఇలా కొన్ని ప్రాంతాలకు ఈ వసతులు లేక పోవడానికి అనేక వాదనలు వినిపిస్తున్నాయి. మరి దేశ ప్రగతికి ముఖ్య అంశాలు అయిన మెరుగైన రవాణా మరియు విద్యుత్ అవకాశాలు అందరి దరి చేరే విధంగా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: