కార్గిల్ విజయ్ దివాస్ షాకింగ్ నిజాలు ?
కార్గిల్ విజయ్ దివాస్ గురించి అందరూ తెలుసుకోవలసిన వాస్తవాలు
కార్గిల్ యుద్ధం జమ్ము కాశ్మీర్.. కార్గిల్ జిల్లాలో, నియంత్రణ రేఖ వద్ద జరిగింది. ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి శీతాకాలంలో చొరబాటుదారులు పేరుతో తన సైన్యాలను పంపింది పాక్. లదక్ మరియు కాశ్మీర్ మధ్య సంబంధాలు తగ్గించడం మరియు ఇండియా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సృష్టించడం పాక్ ప్రధాన లక్ష్యం. ఈ నేపథ్యంలోనే ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య కార్గిల్ యుద్ధం జరిగింది.
ఈ కార్గిల్ యుద్ధం మైనస్ 15 డిగ్రీల ఉష్ణోగ్రత లో 40 నుంచి 60 రోజుల వరకు జరిగింది. యుద్ధంలో టైగర్ హిల్ మరియు టోల్ లింగ్ వంటి శిఖరాలను ఇండియా సైన్యం స్వాధీనం చేసుకుంది.
ఈ యుద్ధంలో బీ ఫోర్స్ ఫిరంగి తుపాకులు వాడారు. ఈ యుద్ధం సందర్భంగా అమెరికా జీపీఎస్ సహాయం చేయనప్పటికీ ఇజ్రాయిల్ దేశం ఇండియాకు ఆయుధాలను ఇచ్చి సహకరించింది. ఆ తరువాత 2016 లో భారతదేశం సొంతంగా ఐఆర్ ఎన్ ఎస్ఎస్ వ్యవస్థను అభివృద్ధి చేసుకుంది.
1999 కార్గిల్ యుద్ధం భారత సైనికుల లో చాలా అత్యున్నతమైన ఘట్టం. అయితే ఈ కార్గిల్ శిఖరాన్ని విజయవంతంగా చేయించినందుకు కెప్టెన్ మనోజ్ కుమార్ పాండే, కెప్టెన్ విక్రమ్ బాత్రా, యోగేంద్ర సింగ్ యాదవ్, రైఫిల్ మన్ సంజయ్ కుమార్ ప్రతిష్టాత్మక పరం వీర్ చక్రాలను అందుకున్నారు. ఈ సందర్భంగా కెప్టెన్ విక్రం బాత్ర
"యో దిల్ మాంగే మోర్ "అని పిలుపునిచ్చాడు. ఆ పిల్లకు కాస్త తదనంతరం పెప్సీ నినాదంగా మారిపోయింది.
ఇక ఈ కార్గిల్ యుద్ధం తర్వాత చరిత్రలో రెండు సంఘటనలు నమోదయ్యాయి.
1. అటల్ బీహార్ వాజ్పాయ్ నేతృత్వంలోని ఎన్డీఏ 1999 అక్టోబర్ నెలలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 303 మూడు సీట్లు గెలుచుకుని రికార్డు సృష్టించింది.
2. ఈ యుద్ధం కారణంగా పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ పై జనరల్ పర్వేజ్ ముషారఫ్ అక్టోబర్ 12 1999 న తిరుగుబాటు చేశాడు.
ఇక ఈ కార్గిల్ యుద్ధం అత్యంత ఎత్తులో అంటే.. 4500మీ - 5000మీల పర్వత ప్రాంతంలో జరిగింది. అలాగే ఈ యుద్ధం నేపథ్యంలో జి-8 సహా అమెరికా మరియు పశ్చిమ దేశాలు పాకిస్తాన్ దేశాన్ని తప్పు బడ్డాయి. అలాగే భారతదేశంలో లైవ్ టెలికాస్ట్ అయిన మొట్టమొదటి యుద్ధం కూడా ఇదే కావడం విశేషం. ఇక జులై 26 న అధికారికంగా కార్గిల్ యుద్దం ముగిసింది.