జులై 5: చరిత్రలో ఈ నాడు జరిగిన ముఖ్యంశాలు...

Purushottham Vinay
ఇక చరిత్రలో ఈ నాడు జరిగిన ముఖ్యమైన సంఘటనలు చూసుకున్నట్లయితే ఇక 1687 వ సంవత్సరంలో సర్ ఐజాక్ న్యూటన్ ఫిలాసఫి నేచురాలిస్ ప్రిన్సిపియా మేథ్ మెటికా అనే గ్రంథాన్ని ప్రచురించడం జరిగింది.1811వ సంవత్సరంలో వెనెజులా దేశం స్పెయిన్ దేశం నుంచి విడుదల అయ్యి స్వతంత్రం ప్రకటించుకొంది.1946 వ సంవత్సరంలో బికినీ అనగా ఈత దుస్తులను, పారిస్ ఫేషన్ షో లో, మొట్టమొదటిసారిగా ప్రదర్శించడం జరిగింది.

గుంటూరులో 1954 జూలై 5 రోజున ఆంధ్ర రాష్ట్ర హైకోర్టును నెలకొల్పడం జరిగింది. కోస్తాంధ్ర, రాయల సీమ ప్రాంతాలు అప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ రెండు ప్రాంతాల నాయకులు శ్రీ బాగ్ ఒడంబడిక పై 1937 నవంబరు 15 న సంతకాలు చేయడం జరిగింది. ఇక దాని ప్రకారంగా రాజధాని, హైకోర్టు ఇంకా విశ్వ విద్యాలయం ఈ రెండు కూడా ఒకే చోట కాకుండా వేరు వేరు ప్రాంతాలలో ఉండాలి. దాని ప్రకారంగా గుంటూరులో 1954 జూలై 5 రోజున హైకోర్టుని నెలకొల్పడం జరిగింది. 
ఇక రాయలసీమ ప్రాంతం అయిన కర్నూలును రాజధానిని చేసారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నంలో ఉంది.

1954 వ సంవత్సరంలో ఇంటర్నేషనల్ మీడియా సంస్థ బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (బి.బి.సి.) తన మొట్టమొదటి టెలివిజన్ వార్తా వాహినిని ప్రసారం చేయడం జరిగింది.1962 వ సంవత్సరంలో అల్జీరియా దేశం ఫ్రాన్స్ నుంచి విడుదల అయ్యి స్వతంత్రం పొందింది.1975 వ సంవత్సరంలో కేప్ వెర్డె దేశం పోర్చుగల్ దేశం నుంచి విడుదల అయ్యి స్వతంత్రం పొందింది.1977 వ సంవత్సరంలో పాకిస్తాన్ మిలిటరీ అధికారులు కుట్ర చేసి, పాకిస్తాన్ లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన జుల్ఫికర్ ఆలి భుట్టో ను, ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించడం జరిగింది.2004వ సంవత్సరంలో లోక్ సభ స్పీకర్ సోమనాధ్ చటర్జీ ఆదేశాల పై 2004 జూలై 5 నుంచి లోక్ సభ లో జరిగే శూన్య గంట (జీరో అవర్) చర్చలను అలాగే ప్రత్యక్ష ప్రసారం చేయటం మొదలుపెట్టడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: