మే 3వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం... విశేషాలేంటో తెలుసా..?

Suma Kallamadi
క్యాలెండర్ లో ప్రతిరోజుకీ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈరోజు మే 3 కాగా.. ఈ తేదీకి చరిత్రలో ఎంత ప్రాధాన్యత ఉందో..  ఈరోజు జరిగిన విశేషాలు ఏంటో.. ఇదే రోజున ఏ ఏ ప్రముఖులు జన్మించారో.. ఏ ఏ ప్రముఖులు మరణించారో.. ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

ప్రముఖుల జననాలు:


1896 - వి.కె. కృష్ణ మీనన్, భారత న్యాయవాది, రాజకీయవేత్త, భారత రక్షణ మంత్రి (మ. 1974)


1932: బూదరాజు రాధాకృష్ణ, ప్రసిద్ధ భాషావేత్త. (మ.2006)


1950: మణివణ్ణణ్, భారత సినిమా నటుడు.


1951 - అశోక్ గెహ్లోట్, భారత రాజకీయ నాయకుడు, రాజస్థాన్ 21వ ముఖ్యమంత్రి.


1959 - ఉమా భారతి, భారత కార్యకర్త, రాజకీయవేత్త, మధ్యప్రదేశ్ 16వ ముఖ్యమంత్రి.


1970: పద్మావతి.ఎల్, సాంఘిక నాటకాల్లో లీడ్ రోల్స్ పోషించిన రంగస్థలనటి.


ప్రముఖుల మరణాలు:


1969 - జాకీర్ హుస్సేన్, భారత విద్యావేత్త, రాజకీయవేత్త, 3వ భారత రాష్ట్రపతి (జ .1897)


1981 - నార్గిస్, భారతీయ నటి (జ .1929)


2006 - ప్రమోద్ మహాజన్, భారత రాజకీయ నాయకుడు (జ .1949)


2009 - రామ్ బాల్కృష్ణ షెవాల్కర్, భారత రచయిత, విమర్శకుడు (జ .1931)


సంఘటనలు:


1494: క్రిస్టఫర్ కొలంబస్ జమైకాను కనుగొన్నాడు. దానికి 'ఇయాగొ' అని పేరు పెట్టాడు.


1830: ఆవిరితో నడిచే పాసెంజర్ రైలు యొక్క సేవలు మొదటిసారిగా మొదలయ్యాయి.


1913 - భారతీయ చిత్ర పరిశ్రమకు నాంది పలికిన మొట్టమొదటి ఫుల్ లెంగ్త్ ఇండియన్ మూవీ "రాజా హరిశ్చంద్ర" విడుదలైంది.


1939: నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ స్థాపించాడు.


1978 - యునైటెడ్ స్టేట్స్ యొక్క పశ్చిమ తీరంలో ఉన్న ప్రతి ARPANET అడ్రస్ కి డిజిటల్ ఎక్విప్మెంట్ కార్పొరేషన్ మార్కెటింగ్ ప్రతినిధి మొదటిసారిగా బల్క్ బిజినెస్ ఈమెయిల్ పంపారు. తరువాత దీనిని "స్పామ్" అని పిలిచారు.


1999 - భారత్ వైపు పాకిస్తాన్ సైనికుల చొరబాటు కార్గిల్ యుద్ధానికి దారితీసింది.


2007 - 3 ఏళ్ల బ్రిటిష్ అమ్మాయి మడేలిన్ మక్కాన్ పోర్చుగల్‌లోని ప్రియా డా లూజ్‌లో అదృశ్యమయ్యింది. ఈ మిస్సింగ్ కేసును ఛేదించడం లో పోలీసులు విఫలమయ్యారు. ఆ చిన్నారి ఏమైందో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు.


పండుగలు, జాతీయ దినాలు


ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం


ప్రపంచ ఆస్తమా దినోత్సవం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: