మే 2వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం... విశేషాలేంటో తెలుసా..?

Suma Kallamadi
క్యాలెండర్ లో ప్రతిరోజుకీ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈరోజు మే 2 కాగా.. ఈ తేదీకి చరిత్రలో ఎంత ప్రాధాన్యత ఉందో..  ఈరోజు జరిగిన విశేషాలు ఏంటో.. ఇదే రోజున ఏ ఏ ప్రముఖులు జన్మించారో.. ఏ ఏ ప్రముఖులు మరణించారో.. ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

ప్రముఖుల జననాలు:


1911: పి.పుల్లయ్య, తెలుగు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు. (మ.1985)


1921: సత్యజిత్ రాయ్, భారతీయ చిత్ర దర్శకుడు, స్క్రిప్ట్‌రైటర్, డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్, రచయిత, గేయ రచయిత, మ్యాగజైన్ ఎడిటర్, కాలిగ్రాఫర్, సంగీత స్వరకర్త.(మ.1992)


1929: పెనుమర్తి విశ్వనాథశాస్త్రి, ఆంధ్రప్రభ దినపత్రిక చీఫ్ సబ్ ఎడిటర్, "స్వప్న లిపి" కవితా సంకలనం రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.(మ.1998)


1947: కోడెల శివప్రసాద్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తొలి శాసనసభాపతి.


1964: నారాయణం నరసింహ మూర్తి, పర్యావరణ వేత్త.


1969: బ్రియాన్ చార్లెస్ లారా, ట్రినిడాడియన్ మాజీ అంతర్జాతీయ క్రికెటర్.


1972: డ్వేన్ డగ్లస్ జాన్సన్(ది రాక్), అమెరికన్ నటుడు, నిర్మాత, రిటైర్డ్ ప్రొఫెషనల్ రెజ్లర్, మాజీ అమెరికన్ ఫుట్‌బాల్ ప్లేయర్, కెనడియన్ ఫుట్‌బాల్ ప్లేయర్.


ప్రముఖుల మరణాలు:


1519: లియొనార్డో డావిన్సి, గణిత శాస్త్రజ్ఞుడు, ఇంజనీర్, చిత్రకారుడు, శిల్పకారుడు, ఆర్కిటెక్ట్, వృక్షశాస్త్రజ్ఞుడు, సంగీత కళాకారుడు. (జ.1452)


1975: పద్మజా నాయుడు, సరోజిని నాయుడు కుమార్తె. పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నరు. (జ.1900)


2002: దేవిక, తమిళ-తెలుగు-మలయాళం నటీమణి.(జ.1943)


2002 - డబ్ల్యూ.టి. టుట్టే, ఇంగ్లీష్-కెనడియన్ గణిత శాస్త్రవేత్త, విద్యావేత్త.


2011 - ఒసామా బిన్ లాడెన్, సౌదీ అరేబియా ఉగ్రవాది, అల్-ఖైదా వ్యవస్థాపకుడు (జ. 1957)


2013 - ఎర్నీ ఫీల్డ్, ఇంగ్లీష్ బాక్సర్ (జ .1943)



సంఘటనలు:


1955 - టేనస్సీ విలియమ్స్ అనే నటుడు "క్యాట్ ఆన్ ఏ హాట్ టిన్ రూఫ్" అనే చిత్రంలో అద్భుతమైన నటనా చాతుర్యాన్ని కనబరిచినందుకు గాను పులిట్జర్ బహుమతిని గెలుచుకున్నాడు.


1986 - చెర్నోబిల్ విపత్తు: ఈ విపత్తు జరిగిన ఆరు రోజుల తరువాత చెర్నోబిల్ నగరాన్ని ఖాళీ చేశారు.


2004 - యెల్వా ఊచకోత ముగిసింది.  ఈ మారణహోమం ఫిబ్రవరి 4, 2004 న సాయుధ ముస్లింలు 78 మంది క్రైస్తవులను యెల్వా వద్ద చంపినప్పుడు ప్రారంభమైంది. ప్రతీకారంగా మే 2 న సుమారు 630 మంది ముస్లింలను క్రైస్తవులు చంపారు.


2008 - నార్గిస్ తుఫాను దెబ్బకు 138,000 మంది చనిపోగా, లక్షలాది మందిని నిరాశ్రయులయ్యారు.


2011 - సెప్టెంబర్ 11 దాడుల వెనుక అనుమానితుడు, ఎఫ్.బి.ఐ యొక్క మోస్ట్ వాంటెడ్ వ్యక్తి ఒసామా బిన్ లాడెన్ ని యునైటెడ్ స్టేట్స్ ప్రత్యేక దళాలు పాకిస్తాన్ లోని అబోటాబాద్ లో చంపేశాయి.


పండుగలు, జాతీయ దినాలు:


మే 2- ప్రపంచ తున దినోత్సవం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: