ఏప్రిల్ 11వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం... విశేషాలేంటో తెలుసా...?

Spyder
గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేషణల సమహారమే చరిత్ర. నాటి ఘటనలను..మానవుడు నడిచి వచ్చిన బాటలను స్మరించుకోవడానికే చరిత్రే. ప్రపంచ మానవాళి పరిణామ క్రమంలో ఏప్రిల్ 11వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం

ముఖ్య సంఘటనలు..

2016 : ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకు భారతదేశంలో ప్రారంభించబడింది.
1919: అంతర్జాతీయ కార్మిక సంస్థ ఏర్పడింది.

ప్ర‌ముఖుల జననాలు

1827: జ్యోతీరావు పూలే, సంఘ సంస్కర్త జననం. (మ. 1890)
1869: కస్తూరిబాయి గాంధీ, భారత స్వాతంత్ర్యోద్యమ కర్త, మహాత్మా గాంధీ సతీమణి. (మ. 1944)ఆమె తన భర్త ప్రోత్సాహంతో, కుమారునితో పాటు భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నది. ఆమె 62 సంవత్సరాల పాటు గాంధీతో కలసి జీవించింది. దక్షిణాఫ్రికా ప్రవాస భారతీయుల జీవన పోరాటంలోనూ, భారత స్వాతంత్ర్యోద్యమంలోనూ పాల్గొని నిర్బంధాలను కలిసి ఎదుర్కొన్నది. భారత దేశానికి స్వాతంత్ర్యం రాక పూర్వమే పూణే లోని ఆగాఖాన్ ప్యాలస్ లో 1944 ఫిబ్రవరి 22న కన్నుమూసింది.
1904: కుందన్ లాల్ సైగల్, భారత గాయకుడు,, నటుడు. (మ. 1947). జలంధర్ భారతీయ గాయకుడు, నటుడు. ఇతడు బాలీవుడ్ మొదటి సూపర్ స్టార్ గా పరిగణింపబడుతాడు. సైగల్ కాలంలో బాలీవుడ్ కు కలకత్తా కేంద్రంగా వుండేది, ప్రస్తుతం ముంబాయి కేంద్రంగా ఉంది. సైగల్ తన 42వ యేటనే మరణించాడు. మరణానికి ముందు అనేక హిట్ సినిమాలు అందించాడు. నౌషాద్ సంగీత దర్శకత్వంలో నిర్మింపబడిన సినిమా షాజహాన్ ( 1946 ) సూపర్ హిట్ అయ్యింది. జబ్ దిల్ హీ టూట్ గయా, హమ్ జీకే క్యా కరేఁ హిందీ పాటల మకుటంలో మణి. తన పదునైదు ఏండ్ల ప్రస్థానంలో సైగల్ 36 సినిమాలలో నటించాడు - 28 హిందీ/ఉర్దూ, 7 బెంగాలీ,, ఒక తమిళ సినిమా. ఇవే కాకుండా హిందీ/ఉర్దూ హాస్యభరిత సినిమా ఐన దులారీ బీబీ (3 రీళ్ళు) లో నటించాడు, ఈ సినిమా 1933లో విడుదల అయింది.
1991: పూనం పాండే, భారతీయ మోడల్, సినిమా నటి. ఢిల్లీలో జన్మించింది. అక్కడే పాఠశాల విద్యను పూర్తిచేసింది. 12 వ తరగతి తర్వాత మోడలింగ్ చేయసాగింది. 2010 లో గ్లాడ్‌రాక్స్ పత్రిక నిర్వహించిన అందాల భామల పోటీలో తొలి 8 మందిలో నిలిచింది. అలాగే ఒక ఫ్యాషన్ పత్రిక ముఖచిత్రంపై ఈవిడ చిత్రం దర్శనమిచ్చి పలువురు దృష్టిలో పడింది. 2011 లో ఈవిడ చిత్రం 21 క్యాలెండర్ లలో ముద్రితమైంది. ఇందులో ప్రపంచ ప్రసిద్ధి చెందిన గ్లాడ్‌రాక్స్ క్యాలెండర్ కూడా ఉంది. భారతదేశంలో ముద్రితమయ్యే కింగ్‌ఫిషర్ క్యాలెండర్ లో 2011 లో ఈవిడ చిత్రం ప్రచురితమైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 5 లో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయం సాధించిన తర్వాత ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్ పత్రికలో అభ్యంతరకరంగా పోజులిచ్చిన ఈవిడ చిత్రాలు ప్రచురితమవడంతో మనదేశంలో చిన్నపాటి సంచలనం సృష్టించి సినీ నిర్మాతల దృష్టిని ఆకర్షించగలిగింది

ప్ర‌ముఖుల మరణాలు


1890: జోసెఫ్ కేరీ మెర్రిక్, ఏనుగు-మనిషి ఆకారంలో పుట్టిన వ్యక్తి. 27 సంవత్సరాలు బ్రతికాడు. (జ. 1862).
2010: పైల వాసుదేవరావు, శ్రీకాకుళం నక్సలెట్ ఉద్యమ యోధుడు. (జ.1932)

పండుగలు , జాతీయ దినాలు
ప్రపంచ పార్కిన్సన్ దినోత్సవం

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: