చరిత్రలో ఈరోజు : 22-07-2020 రోజున ఏం జరిగిందంటే..?

praveen

జులై 22వ తేదీన ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి చూస్తే ఎన్నో  ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖుల జననాలు  ఇంకెంతో మంది ప్రముఖుల మరణాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు  జన్మించిన ప్రముఖులు సంభవించిన మరణాలు జరిగిన ముఖ్య సంఘటనలు ఏంటో తెలుసుకుందాం రండి. 

 

 ముఖేష్ జననం : భారతీయ చలన చిత్ర పరిశ్రమకు చెందిన నేపథ్య గాయకుడు అయిన  ముఖేష్ 1950 నుంచి 70 ల  మధ్య కాలంలో ఎంతగానో గుర్తింపు సంపాదించాడు. ఈయన  1923 జూలై 22 వ తేదీన జన్మించారు.తన పాటలతో ఎంతో మంది సంగీత ప్రేక్షకులను ఉర్రూతలూగించారు ముఖేష్. పాడినవి కొన్ని పాటలు అయినప్పటికీ తన గాత్రంతో తన పాటలతో సంగీత ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. అప్పట్లో ముఖేష్ పాడిన ఎన్నో పాటలు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మైలురాళ్లుగా నిలిచిపోయాయి. ఉత్తమ నేపథ్య గాయకుడుగా జాతీయ పురస్కారాన్ని సైతం అందుకున్నారు ముఖేష్. 

 

 దాశరథి కృష్ణమాచార్య జననం : ప్రముఖ తెలుగు మహా కవి అయిన దాశరధి కృష్ణమాచార్య 1925 జులై 22వ తేదీన జన్మించారు. తెలంగాణ ప్రజల కన్నీళ్లను అగ్నిధార గా మలిచి  నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన మహోన్నత వ్యక్తి దాశరథి కృష్ణమాచార్య. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించి ఉద్యమానికి ప్రేరణ అందించిన  కవి దాశరథి. ఇక ఈయన రచనలన్నీ ప్రజల్లో కొత్త ఊపిరి నింపడమే కాదు... నిజాం పాలకుల గుండెల్లో కత్తుల్లా  దూసుకుపోయాయి అనే చెప్పాలి. 

 

 గ్రెగర్ మెండల్ జననం : ప్రముఖ జీవశాస్త్రవేత్త అయిన గ్రెగర్ జోహన్ మెండల్ 1822 జూలై 22 వ తేదీన జన్మించారు. జన్యువులను తొలిసారిగా ప్రపంచానికి తెలియజేసిన శాస్త్రవేత్తగా ఈయన రికార్డు సృష్టించారు. ఎలాంటి పరికరాలు లేకుండానే బటాని మొక్కలు పెరట్లో పెంచి... అతి సున్నితమైన ప్రయోగాలు చేసి... అద్భుతమైన వివరాలు ఫలితాలను ఆధారంగా చేసుకుని ఎన్నో విషయాలను ప్రపంచానికి వెల్లడించారు. అంతేకాకుండా జన్యుశాస్త్రం ఎంతగానో విస్తరించేందుకు కృషి చేశారు. ఎన్నో  పరిశోధనలు చేసి ప్రపంచానికి ఎన్నో కొత్త విషయాలను తెలియజేశారు. 

 

 అర్మాన్ మాలిక్ జననం: భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నేపథ్య గాయకుడు నటుడు అయిన అర్మాన్ మాలిక్ 1995లో 22వ తేదీన జన్మించారు. సరిగమప లిటిల్ చాంప్స్ లో ఫైనలిస్ట్ అర్మాన్ మాలిక్. ప్రముఖ సంగీత దర్శకులు నేపథ్య గాయకుడు అయిన డబ్బు మాలిక్ కుమారుడు అర్మాన్ మాలిక్. 

 

 ఏజీ కృపాల్ సింగ్ మరణం  : భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు అయిన ఏజి  కృపాల్ సింగ్ 1987 జులై 22వ తేదీన పరమపదించారు. కృపాల్ సింగ్ ప్రముఖ క్రికెట్ ఫ్యామిలీ నుంచి వచ్చారు . కృపాల్ సింగ్ సోదరుడు మిల్కా సింగ్ కూడా ప్రముఖ టెస్ట్ క్రికెటర్ . అంతేకాకుండా ఈయన కుటుంబం లో ఎంతోమంది ఫస్ట్ క్లాస్ క్రికెట్ కూడా ఆడారు. భారత జట్టులో స్థానం సంపాదించిన కృపాల్ సింగ్  ఎన్నో ఏళ్ల పాటు భారత జట్టులో సేవలు అందించారు. ఎంతగానో  ప్రతిభ కనబరుస్తూ గుర్తింపు సంపాదించారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: