చరిత్రలో ఈరోజు : 25-05-2020 రోజున ఏం జరిగిందంటే..?

praveen

మే 25వ తేదీన ఒకసారి చరిత్రలో కి వెళ్లి చూస్తే ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖులు జననాలు ఇంకెంతో మంది ప్రముఖుల మరణాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర లోకి వెళ్లి ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనలు జననాలు మరణాలు ఏంటో తెలుసుకుందాం రండి. 

 

 రాస్ బిహారీ బోస్ జననం : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు అయిన రాజ్ బిహారి బోస్ 1986 మే 25 వ తేదీన జన్మించారు. ఈయన  భారత స్వాతంత్రోద్యమంలో ఎన్నో కీలక ఉద్యమాలలో పాల్గొన్నారు. 

 

 కల్లూరు సుబ్బారావు జననం : అనంతపురం జిల్లాకు చెందిన స్వాతంత్ర సమరయోధుడు కల్లూరు సుబ్బారావు 1897 మే 25 వ తేదీన జన్మించారు. తెలుగు కన్నడ కవి మరియు వృత్తిరీత్యా అధ్యాపకుడైన సుబ్బారావు 1920 లలో స్వాతంత్ర ఉద్యమంలో చేరాడు. 1921లో విజయవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు స్వచ్ఛంద సేవకుడిగా చేరారు . స్వతంత్ర ఉద్యమంలో అనేక పర్యాయాలు జైలు కి వెళ్లి మొత్తం ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు కల్లూరి సుబ్బారావు. బ్రిటిష్ వారు కల్లూరి సుబ్బారావును  కాంగ్రెస్ పులి అని అభివర్ణించారు.  బాబు రాజేంద్రప్రసాద్ ఈయనను  జైలు పట్టభద్రుడు అని కొనియాడారు. భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత మద్రాసు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు కల్లూరు సుబ్బారావు. 1955లో ఆంధ్ర రాష్ట్ర శాసనసభకు 1965లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు హిందూపురం శాసనసభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 1955లో శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా కూడా పని చేశారు. 

 


 కరణ్ జోహార్ జననం : ప్రముఖ భారతీయ దర్శకుడు నిర్మాత స్క్రీన్ ప్లే రైటర్ కాస్ట్యూమ్ డిజైనర్ నటుడు అయిన  కరణ్ జోహార్ భారత సినీ ప్రేక్షకులందరికీ కొసమెరుపు. కరణ్  జోహార్  1972 మే 25 వ తేదీన జన్మించారు. మొదట దర్శకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన కరణ్జోహార్ ఎన్నో విజయవంతమైన సినిమాలను నిర్మించారు. ముఖ్యంగా బాలీవుడ్ లో కరణ్ కి   హీరోలకు మించిన క్రేజ్ ఉంటుంది. ఇక ఈయన దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలకు ఫిలింఫేర్ అవార్డులు సైతం గెలుచుకున్నారు. ఆ తర్వాత నిర్మాతగా అవతారం ఎత్తిన కరణ్జోహార్ ఎన్నో విజయవంతమైన సినిమాలను నిర్మించి ప్రత్యేక గుర్తింపును సంపాదించారు. ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు. అంతేకాకుండా బుల్లితెరపై కాఫీ విత్ కరణ్ అనే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం లో కూడా చేసి ఎంతో మంది ప్రముఖ సినీ సెలబ్రిటీలు ఇంటర్వ్యూ కూడా చేశాడు. కాగా కరణ్ జోహార్ ఇప్పటి వరకు ఆయన సినీ జీవితంలో ఎన్నో  ఫిలింఫేర్ అవార్డులను గెలుచుకున్నారు. 

 

 కార్తీ జననం : తమిళ హీరో కార్తీ అటు తెలుగు మలయాళం ప్రేక్షకులకు కూడా ఒక కొసమెరుపు . కార్తీక1977 మే 25 వ తేదీన జన్మించారు. తమిళంలో హీరోగా తన ప్రస్థానం మొదలుపెట్టిన కార్తి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. కార్తీ పూర్తి పేరు కార్తిక్ శివకుమార్. కార్తీ తమిళంలో నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో కూడా డబ్ కావడంతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఫేవరెట్ హీరో గా మారిపోయాడు . ప్రస్తుతం తమిళ ప్రేక్షకులు కంటే తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా హీరో కార్తి ని ఆదరిస్తూ ఉంటారు. 

 

 సునీల్ దత్ మరణం : భారతదేశ సినిమా నటుడు ప్రముఖ రాజకీయ వేత్త అయిన సునీల్ దత్ 2005 మే 25వ తేదీన మరణించారు. సినీ నటుడిగా ప్రత్యేక ప్రస్థానాన్ని కొనసాగించారు సునీల్ దత్. ఇక రాజకీయవేత్తగా కూడా భారత రాజకీయాలను ను ఎంతగానో  ప్రభావితం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: