చరిత్రలో ఈరోజు : 03-05-2020 రోజున ఏం జరిగిందంటే..?

praveen

మే 3 వ  తేదీన ఒకసారి చరిత్ర లోకి వెళ్లి చూస్తే ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖులు జననాలు ఇంకెంతో మంది ప్రముఖుల మరణాలు జరిగాయి. ఒక్కసారి చరిత్రలోకి వెళ్లి  ఈ రోజు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. 

 

 

 బూదరాజు రాధాకృష్ణ జననం : ప్రముఖ భాషా శాస్త్రవేత్త సీనియర్ పాత్రికేయులు అయిన బూదరాజు రాధాకృష్ణ 1932 మే 3వ తేదీన జన్మించారు. పాత్రికేయులకు భాషాభిమానులకు విశేషంగా ఉపయోగపడే అనేక పుస్తకాలను రచించారు బూదరాజు  రాధాకృష్ణ. తెలుగు సంస్కృత భాషల్లో మంచి పట్టున్న బూదరాజు రాధాకృష్ణ వాస్తు పదకోశం వ్యవహార కోశం మొదలైన భాషా సంబంధ పుస్తకాలు రచించి ఎంతగానో ప్రేక్షకాదరణ పొందేలా చేశారు. ఆధునిక పత్రికల తెలుగు భాష ప్రామాణిక రచించిన ఘనత బూదరాజు రాధాకృష్ణ కే దక్కుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రిన్సిపాల్ గా పదేళ్లకు పైగా పనిచేశారు. మహాకవి శ్రీశ్రీ అని పుస్తకాన్ని బూదరాజు రాధాకృష్ణ భారతీయ సాహిత్య నిర్మాతలు శీర్షిక కోసం 1999లో ఆంగ్లంలో రచించారు. 

 

 

 మణివన్నన్ జననం  : ప్రముఖ తమిళ సినీ నటుడు దర్శకుడు అయిన మణివణ్ణన్  తమిళ ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు సంపాదించారు. 1954 మే మూడో తేదీన జన్మించారు. దాదాపు నాలుగు వందల సినిమాల్లో నటించి తనదైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు ఈయన . ఇతను నటన పరంగా ఎంతో నైపుణ్యం గల వ్యక్తి . ఎలాంటి పాత్ర పోషించిన ఆ పాత్రకు ప్రాణం పోసేలా  నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు ఈయన . సాధారణంగా ఎక్కువగా తండ్రి పాత్రలో కనిపించారు. హీరో హీరోయిన్లకు తండ్రి పాత్రలో కనిపించిన ఈయన తండ్రి పాత్రలకు ప్రాణం పోశారు అనే చెప్పాలి. 

 

 

 ఉమాభారతి జననం : భారత దేశపు రాజకీయ వేత్త అయిన ఉమా  భారతి 1959 మే 3వ తేదీన జన్మించారు. కాశయ దారిని అయిన ఉమా భారతి భారత రాజకీయ వేత్తగా ఎన్నో పదవులను అలంకరించారు. 

 

 

 పద్మావతి ఎల్  జననం : రంగస్థల నటిగా అపార అనుభవం ఉన్న వ్యక్తి పద్మావతి. ఈమె 1975 మే 3వ తేదీన జన్మించారు. దాదాపు 16 సంవత్సరాల రంగస్థల నటిగా అనుభవం నుండి పద్మావతికి . ఈమె ఎన్నో  సాంఘిక నాటిక నాటకాల్లో ప్రధానంగా  స్త్రీ పాత్రలు పోషించారు. ఎన్నో నాటకాల్లో తనదైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు పద్మావతి. ప్రస్తుతం ఈమె జనచైతన్య సాంస్కృతిక సంస్థ ఒంగోలు కోశాధికారిగా వ్యవహరిస్తున్నారు. రంగస్థల నటిగా అపార అనుభవం ఉన్న పద్మావతి ఎన్నో అవార్డులు సైతం గెలుచుకున్నారు. 

 

 

 షేక్స్పియర్ మరణం : ఆంగ్ల కవి నాటక రచయిత నటుడు అయినా విలియం షేక్స్ పియర్ 1616 మే 3వ తేదీన మరణించారు. ఈయన  ఆంగ్ల గొప్ప రచయితగా అభివర్ణిస్తూ ఉంటారు. కొంచెం నాటక రచయితలలో  ఎంతో గొప్పవాడిగా కూడా ఆయనకు గుర్తింపు ఉంది. 

 

 

 జాకీర్ హుస్సేన్ మరణం : భారతదేశపు మూడవ రాష్ట్రపతి అయిన జాకీర్ హుస్సేన్ 1969 మే 3 వ  తేదీన మరణించారు. ఈయన బీహార్ గవర్నర్గా 1957 నుంచి 1962 వరకు సేవలందించారు. ఆ తర్వాత ఉప రాష్ట్రపతిగా 1962 నుండి 1967 వరకు సేవలందించారు. మే 13 1967 న భారత రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డారు జాకీర్ హుస్సేన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: