Lady's Tips: ప్రతి ఆడపిల్ల తల్లి కచ్చితంగా నేర్చుకోవాల్సిన వంటకం ఇది..!
అలా ఆరోగ్యానికి స్ట్రాంగ్ చేసేదే ఈ వంటకం. ఈ ఒక్క వంటకంలోనే పూర్తి ఆరోగ్య రహస్యం తాగింది అని చెప్పడంలో సందేహమే లేదు. అదే "పిట్టు". పిట్టు అనేది కేవలం ఒక వంటకం మాత్రమే కాదు, ఇది ప్రత్యేకంగా ఆడపిల్లలకు బలం, ఆరోగ్యం మరియు శక్తిని అందించే దివ్య ఔషధం కూడా. పిట్టు ..బియ్యం లేదా రకరకాల మిలట్లతో తయారు చేసి తినవచ్చు. ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు, మరియు ఇందులో ఏ రకమైన హానికరమైన లేదా అనారోగ్యకరమైన అంశమే లేదు.
గతంలో కొందరు ఇడ్లీ రవ్వతో పిట్టు తయారు చేసేవారు, కానీ బియ్యపు పిండితో చేసిన పిట్టుకే ఎక్కువ ప్రాధాన్యత, అది తింటేనే బలం వస్తుంది అనేది నమ్మకం. బియ్యపు పిండితో చేసిన పిట్టులో అనేక ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా ఆడపిల్లలకు నడుము బలం, శక్తి పెంపొందించడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పెద్దవాళ్లు కూడా, ముఖ్యంగా పుష్పవతి అయిన పిల్లల కోసం, ఈ పిట్టును సాంప్రదాయ ప్రకారం తప్పక అందజేస్తారు.
పిట్టు అనేది పూర్వికుల కాలం నుండి మన సాంప్రదాయ వంటకాలలో భాగంగా ఉండే రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన వంటకం. పిట్టు తయారీ విధానం అత్యంత సులభం. వంటకంలో కొత్తగా ఉన్నవారు కూడా సులభంగా ఈ వంటకాన్ని తయారు చేయవచ్చు. పండగలు, ఉత్సవాలు మాత్రమే కాదు, వారంలో ఒకటి రెండు సార్లు పిట్టు తినడం ద్వారా నడుముకు బలాన్ని, శక్తిని అందించవచ్చు. ప్రత్యేకంగా ఆడపిల్లల ఆరోగ్యానికి, డెలివరీ సమయంలో మరియు డెలివరీ తర్వాత నడుముకు బలం చేరుస్తేందుకు పిట్టు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పటివరకు పిట్టు తయారీ కోసం యూట్యూబ్‌లో పలు రకాల వీడియోలు అందుబాటులో ఉన్నాయి. వాటిని చూసి పిట్టు రాని వ్యక్తులు కూడా సులభంగా ఈ వంటకాన్ని తయారు చేసి తింటే, పూర్తి ఆరోగ్య లాభాలను పొందవచ్చు.పిట్టు – మన సంప్రదాయ ఆహారంలో ఒక అమూల్యమైన వంటకం, శక్తి, ఆరోగ్యం, మరియు సంతోషాన్ని అందించే ఒక సంపూర్ణ దివ్య రహస్యం.