తీపి శృంగారానికి ఇంత పెద్ద శాప‌మ‌వుతోందా.. !

RAMAKRISHNA S.S.
- ( హెల్త్ టిప్స్‌ - ఇండియా హెరాల్డ్ )

ప్రస్తుతం మానవ జీవన విధానం పూర్తిగా మారిపోయింది. అంతా ఉరుకు పరుగుల జీవితం అయిపోయింది. మనిషి ప్రశాంతంగా ఉండే పరిస్థితి లేదు. ఈ పోటీ ప్రపంచంలో ఎప్పటికప్పుడు ఉరుకులు పరుగులు పెడుతూ యాంత్రిక జీవితంలోకి మారిపోయాడు. ఒకప్పుడు శృంగార జీవితం అనేది మనస్ఫూర్తిగా ఆస్వాదించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. భార్యా భర్తలు దాంపత్య జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించ లేకపోతున్నారు. అంత సమయం కూడా ఉండటం లేదు. ఇది అనేక రకాల సమస్యలకు దారి తీస్తుంది. ఇదిలా ఉంటే మగవారిలో శృంగార సామర్థ్యం క్షమించడానికి వయసు టెస్టు స్టెరాన్ హోర్మన్ తగ్గటం మాత్రమే కారణమని ఇప్పటివరకు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు సరికొత్తగా మరో విషయం బయటకు వచ్చింది.


రక్తంలో గ్లూకోజ్ మోతాదులు పెరగటం కారణమవుతున్నట్టు తాజా అధ్యయనం చెబుతోంది. మధుమేహంగా గుర్తించే స్థాయిలో గ్లూకోజ్ పెరగాల్సిన అవసరం లేదు. ఒకింత ఎక్కువగా పెరిగిన శుక్రకణాల వేగం నెమ్మదించడానికి అంగస్తంభన బలహీనం కావటానికి శృంగారం పట్ల ఆసక్తి తగ్గడానికి దారితీస్తున్నట్టు తెలిసింది. మగవారు తమ శృంగార సంతాన సామర్థ్యాన్ని కాపాడుకోవడానికి కేవలం టెస్టు స్థిరాన్ హోర్మోన్ మోతాదులే కాకుండా రక్తంలో గ్లూకోజ్ ను నియంత్రించుకోవడం కూడా ముఖ్యమైన విషయం అని తాజా అధ్యయన ఫలితం సూచిస్తుంది. మ‌రి ఇక‌పై గ్లూకోజ్ స్థాయి ని శరీరంలో నియంత్రి చుకునే విష‌యం లోనూ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది.


ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: