స్వెటర్ వేసుకునే నిద్రపోతున్నారా.. అయితే ప్రమాదంలో పడ్డట్టే?

praveen

అవును, మీరు విన్నది నిజమే. అయితే శీతాకాలం తప్పదంటారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్టే. అవును, సాధారణంగా ఈ కాలంలో ఎక్కువ చలి కారణంగా చాలామంది రాత్రిపూట చలిని తట్టుకోవడం కోసం స్వెట్టర్లు వేసుకొని నిద్రపోతూ ఉంటారు. అయితే నిద్రపోవడానికి తీసుకునే జాగ్రత్తల్లో తెలిసీ తెలీకుండా చేస్తున్న ఈ పొరపాటు మీ ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ అలవాటు మీకు ఉంటే మాత్రం ఇప్పటి నుంచి మానేయడం మంచిది. ఎందుకంటే, ఉన్ని బట్టలు వేసుకుని నిద్రపోవడం వలన చలికి దూరంగా ఉండొచ్చు కానీ, ఆరోగ్యానికి హాని చేస్తుంది.
అవును... స్వెటర్ ధరించి నిద్రించడం వల్ల శరీరంలో అనేక రకాల దుష్ప్రభావాలు కలుగుతాయి. నిజానికి ఉన్ని వేడిని బందిస్తుంది. ఇలా చేయడం వల్ల అది మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. దీనితో చర్మంపై దురద, దద్దుర్లు వంటివి ఏర్పడతాయి. అంతే కాకుండా స్వెటర్ ధరించడం వల్ల శరీరంలోని ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. దీని కారణంగా, ఉదయాన్నే అలసిపోయినట్లు అనిపిస్తుంది. ఈ చలి వాతావరణం నుంచి చిన్నపిల్లలను కాపాడుకోవడానికి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి అని నిపుణుకులు చెబుతున్నారు. దీనికి వెచ్చని బట్టలు, స్వెటర్లతో కప్పి ఉంచుకోవడం మంచిది, అయితే రాత్రి సమయాల్లో ఉన్ని దుస్తులను కప్పి ఉంచుకోవడం అనేది ఆరోగ్యానికి ప్రమాదమే అని చెబుతున్నారు.
ఇంకా రాత్రిపూట స్వెటర్లు ధరించడం వల్ల చర్మం పొడిబారిపోయి, దద్దుర్లు వంటివి ఏర్పడతాయి. అదే రాత్రిపూట చిన్న చిన్నపిల్లలకి స్వెటర్లు వంటివి వేసినట్లయితే... డి హైడ్రేషన్ కి దారితీస్తుంది. చర్మ అలెర్జీలు, అటోపిక్ డెర్మటైటిస్ సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. అతిగా కప్పడం వల్ల రాత్రిపూట విపరీతమైన చెమటలు పట్టడం వల్ల కూడా రక్తపోటు తగ్గుతుంది. తిమ్మిరి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది చాలా మందికి నిద్ర భంగం కలిగిస్తుంది. గుండె జబ్బుల చరిత్ర ఉన్నవారు నిద్రపోయేటప్పుడు బిగుతుగా ఉన్ని ధరించినట్లయితే వారి ఛాతీలో భారం, శ్వాస సమస్యలు కూడా రావచ్చని అంటున్నారు. ఉన్ని బట్టలు, స్వెటర్‌లతో ఉబ్బసం వచ్చే అవకాశం ఉందని డాక్టర్స్ కూడా చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: