జ్వరం వచ్చినప్పుడు.. స్నానం చేస్తే ఏంజరుగుతుందో తెలుసా..?

Divya
వాతావరణంలో మార్పుల వల్ల సీజన్ కు తగ్గట్టుగానే ప్రజలకు వ్యాధుల ప్రమాదం రోజురోజుకి పెరుగుతూనే ఉంది. కావున ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది.అంతే కాకుండా ఆరోగ్యవంతంగా ఉండడం కోసం పలు రకాల చర్యలు కూడా చేయబడుతూ ఉండాలి. అయితే వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలా మంది వైరల్ ఫీవర్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ కూడా విష జ్వరాల బారిన పడుతూ ఉన్నారు. అందుకు ప్రధాన కారణం బ్యాక్టీరియానే అని చెప్పవచ్చు. ఈ బ్యాక్టీరియా వల్ల రోగ నిరోధక శక్తి కూడా చాలా బలహీనంగా మారుతుందట.

అయితే వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు చాలా మందికి కొన్ని సందేహాలు ఉంటాయి. ఏం తినాలి ఏవి తినకూడదు స్నానం చేయవచ్చా లేదా అనే విషయం ఎక్కువగా ప్రజలలో మెదులుతూ ఉంటుంది. ఈ విషయం పైన ఆరోగ్య నిపుణులు ఏం చెప్పారంటే .. జ్వరము, శరీర నొప్పులు ,అలసట, తలనొప్పి వంటివి వైరల్ ఫీవర్ యొక్క ముఖ్య లక్షణాలు అన్నట్టుగా తెలుపుతున్నారు. ఈ వైరల్ ఫీవర్ రావడం వల్ల శరీరం కూడా చాలా బలహీనంగా మారి బరువును కూడా తగ్గించేలా చేస్తుంది.

కొంతమంది వైద్యులు జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయడం మంచిదని చెబుతూ ఉంటారు. ఇది శరీరం మురికిని తొలగిస్తుందని మానసికంగా ఆహ్లాదాన్ని కలిగిస్తుందట.కానీ ఇలాంటి సమయాలలో పిల్లలు లేదా వృద్ధులు జ్వరం వచ్చినప్పుడు స్నానం చేసేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్నిసార్లు స్నానం చేసేటప్పుడు కొంతమందికి అసౌకర్యంగా కూడా అవుతుందట. అందుకే వైరల్ ఫీవర్ వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.

అయితే వైరల్ ఫీవర్ రాకుండా ఉండాలి అంటే ప్రతిరోజు చేతులు శుభ్రంగా కడుక్కోవడమే కాకుండా గోరువెచ్చని నీటిని తాగడం.. ఒకరు వాడిని దుస్తులను మరొకరు వాడకుండా ఉండడం,మాస్కులు వంటివి ధరించడం, వైరల్ ఫీవర్ వచ్చిన రోగికి కాస్త దూరంగా వ్యత్యాసాన్ని పాటించడం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: