ఆ టాబ్లెట్స్ వేసుకుంటే కిడ్నీలో రాళ్లు.. షాకింగ్ విషయం చెప్పిన డాక్టర్స్?

praveen

విటమిన్ సి మనిషి ఆరోగ్యానికి ఎంత అవసరమో మీకు తెలిసే ఉంటుంది. విటమిన్ సి మృదులాస్థి, ఎముక, డెంటీన్ ల మాత్రికను, రక్తనాళాల ఎండోథీలియమ్ ను చాలా ఆరోగ్యంగా ఉంచడమే కాక, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అందుకే డాక్టర్స్ విటమిన్ సి గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఉంటారు. అది మాత్రమే కాకుండా రక్తంలో కొలెస్టరాల్ ను కరిగించడానికి, గాయాలు త్వరగా మానడానికి, ఇనుము శోషణాన్ని అధికం చేయడానికి కూడా విటమిన్ సి అనేది దోహద పడుతుంది. ఇంకా విటమిన్ సి రక్తపోటును తగ్గిచటం, రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచటంలో పాత్ర పోషిస్తుంది కాబట్టి.. దీని మోతాదు తగ్గితే అది మంచిది కాదని కూడా చెబుతూ ఉంటారు.
అయితే దీనిని కొంతమంది నేరుగా సంప్లిమెంట్లు రూపంలో తీసుకుంటూ ఉంటారు. కానీ అది అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలా డైరెక్టుగా విటమిన్ సి సప్లిమెంట్స్ తీసుకుంటే, కిడ్నీలో కాల్షియం ఆక్సలేట్ రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ విషయాన్ని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ వైద్యుడు అయినటువంటి విజయ్ కిరణ్ తాజాగా వెల్లడించారు. దీనిని సప్లిమెంట్ రూపంలో కంటే కూడా ఆహారం రూపంలోనే తీసుకుంటే ఉత్తమం అని చెబుతున్నారు. విటమిన్ సి ఎక్కువగా నిమ్మ, నారింజ జాతి ఫలాలు, ఉసిరి, ఆకుకూరలు, తాజా బంగాళాదుంప, టమాటో మొదలైన వాటిలో ఎక్కువగా లభిస్తుంది.
ఇది సప్లిమెంట్ల రూపంలో కూడా మెడికల్ షాపుల్లో లభ్యమవుతుంది. అయితే మాత్రలను వేసుకోవటం కన్నా ఆహారం ద్వారానే విటమిన్ సి లభించేలా చూసుకోవటం మేలని ఆరోగ్య నిపుణుల మాట. విటమిన్ సి లోపమనేది ఒక రకంగా అనారోగ్యకర జీవనశైలికి నిదర్శనమని, ఇది పక్షవాతం ముప్పును కూడా పెంచే అవకాశం ఉందని గుర్తు చేస్తున్నారు. మద్యపానం, అధిక బరువు, అధిక రక్తపోటు వంటివన్నీ కూడా పక్షవాతం ముప్పును పెంచేవే. మన జీవనశైలిని మార్చుకోవటం ద్వారా వీటిని దూరంగా ఉంచుకోవచ్చు. అందువల్ల ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండటం అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: