మెట్లు ఎక్కితే ఇన్ని లాభాలా.. తెలిస్తే మళ్లీ లిఫ్ట్ వాడరు?

praveen
నేటి టెక్నాలజీ యుగంలో మనిషి జీవన శైలి ఎంత సులభతరంగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ పని చేయడానికి అయినా సరే సులభమైన మార్గాలను వెతుక్కుంటూ ఉండటం చూస్తూ ఉన్నాం. ఇక టెక్నాలజీ మీద ఆధారపడుతూ అన్నీ కూడా ఎంతో  వేగంగా చేసేయ్య గలుగుతూ ఉన్నారు. అయితే వెళ్లాల్సిన ప్రతి చోటుకి కూడా వేగంగా వెళ్లాలి అనే ఆతృతతో ముందుకు సాగుతున్న మనిషి.. ఇటీవల కాలంలో మెట్లు ఎక్కడమే మరిచిపోయాడు అన్న విషయం తెలిసిందే.

 ఇక ప్రస్తుతం ఎక్కడ చూసినా పెద్దపెద్ద భవనాలే దర్శనమిస్తూ ఉండడం.. ఇక వాటిల్లో భవనాలు ఎక్కడానికి లిఫ్ట్ లు అందుబాటులో ఉండడంతో ఇలా భవనాలు ఎక్కడానికి మెట్లు ఉంటాయి అన్న విషయాన్ని మరిచిపోతున్నారు. అయితే ఇలా ఇలా లిఫ్టులను ఉపయోగిస్తూ చివరికి అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారూ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పటికే బిజీ లైఫ్ లో కనీసం ఎక్కడ నడవడం లేదు. ఇంటిదగ్గర బండి ఎక్కితే ఆఫీస్ వద్ద దిగడం. ఇక ఆఫీసులో లిఫ్ట్ ఎక్కితే ఏకంగా వర్క్ చేసే ప్రదేశానికి చేరుకోవడం.. ఇలా ఎక్కడ శారీరక శ్రమ అనేది లేకుండా పోయింది.

 ఈ మధ్యకాలంలో లిఫ్ట్ లు ఎస్కలేటర్లు ఉపయోగించడం ఎంతలా పెరిగిపోయిందో అందరూ చూస్తూనే ఉన్నారు. దీంతో ఎవరు కూడా కాళ్లకు పని చెప్పడం లేదు. కానీ మెట్లు ఎక్కడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు మెట్లు ఎక్కడం వల్ల తొడ కండరాలు బలపడటంతో పాటు పొట్ట భాగంలోని కూడా కొవ్వు తగ్గుతుందట. చక్కటి శరీరాకృతి కూడా వస్తుంది అంటూ నిపుణులు చెబుతున్నారు. కానీ చాలామంది మెట్లు ఎక్కడ మానేసి జిమ్ కు వెళ్లి వర్కౌట్లు చేస్తున్నారు. పొట్ట తగ్గించుకునేందుకు నానా పాటలు పడుతున్నారు.అయితే మెట్లు ఎక్కేటప్పుడు వేగంగా కాకుండా నెమ్మదిగా స్టెప్స్ ఎక్కడం ఎంతో మంచిది చెబుతూ ఉన్నారు.  హార్ట్ ప్రాబ్లమ్స్ మోకాళ్ళ నొప్పులు మడమ కీళ్ల నొప్పులు ఉన్నవారు మాత్రం ఇలా మెట్లు ఎక్కడానికి దూరంగా ఉండటమే బెటర్ అంటూ నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: