ఏంటి.. ల్యాప్ టాప్ అతిగా వాడితే.. పిల్లలు పుట్టరా?

praveen
నేటి ఆధునిక యుగం లో మనిషి చేసే ప్రతి పని కూడా టెక్నాలజీతో ముడి పడి పోయింది. ఈ క్రమం లోనే టెక్నాలజీని వాడకుండా ఏ పనిని పూర్తి చేయలేక పోతున్నాడు మనిషి. ఒకప్పుడు శారీరక శ్రమ తో అన్ని పనులను పూర్తి చేసిన మనిషి ఇక ఇప్పుడు చెమట చుక్క చిందించకుండానే.. ఇక అన్ని చకచకా చెక్కబెట్టేస్తూ ఉన్నాడు.

 ఇలా అన్ని రంగాల్లో కూడా టెక్నాలజీ అందు బాటులో వచ్చింది. అయితే ఇలా సరికొత్త టెక్నాలజీ మనిషి జీవన శైలిలో కూడా ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. కొన్ని కొన్ని సార్లు ఈ టెక్నాలజీ ఏకంగా అనర్ధాలకు కూడా కారణమవుతోంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య కాలం లో ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరి దగ్గర ల్యాప్టాప్ ఉంటుంది. ల్యాప్టాప్ ద్వారానే తమ రోజువారి ఉద్యోగం లోని పనిని పూర్తి చేయ గలుగుతున్నారు ప్రతి ఒక్కరు. కానీ ఇలా లాప్టాప్ వాడటం వల్ల పిల్లలు పుట్టే సమస్యలు వస్తాయని విషయం చాలా మందికి తెలియదు. లాప్టాప్ వాడటం వల్ల కూడా పిల్లలు పుట్టే సమస్యలు వస్తాయా అని షాక్ అవుతున్నారు కదా.

 ఇటీవలే అధ్యయనం లో ఇలాంటి ఒక సంచలన నిజమే బయట పడింది. ఉద్యోగాల పేరుతో గంటల తరబడి యువకులు లాప్టాప్ లకు అతుక్కు పోతున్నారు  అయితే ఇది ఎంతో ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. విశ్రాంతి తీసుకోకుండా లాప్టాప్ వినియోగించడం వల్ల.. సంతానోత్పత్తి తగ్గుతుంది అంటూ పేర్కొన్నారు నిపుణులు. ముఖ్యం గా మీ ఒడిలో లాప్టాప్ మొబైల్స్ పెట్టుకొని వాడటం మరింత హానికరం అంటూ హెచ్చరిస్తున్నారు. ఇవి విద్యుదయస్కాంత క్షేత్రాలను విడుదల చేయడం వల్ల మగవాళ్లలో స్పర్మ్ నాణ్యత క్రమ క్రమంగా తగ్గి పోతుంది అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తద్వారా ఇక సంతానోత్పత్తి సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: