మనం రెగ్యులర్ గా తినే ఈ ఆహారమే.. పెద్ద పేగు క్యాన్సర్ కు కారణమా?
అదే సమయం లో నేటి రోజుల్లో మారి పోయిన ఆహారపు అలవాట్లు కూడా ఇలాంటి అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. నేటి రోజుల్లో పౌష్టికాహారాన్ని తినడం కంటే జంక్ ఫుడ్ ని తినడానికి ఎక్కువగా అలవాటు పడిపోతున్నారు. అంతేకాదు అదొక ట్రెండ్ అన్నట్లుగా ఫీల్ అవుతున్నారు. చివరికి తినేటప్పుడు ఆనందాన్ని ఇచ్చే జంక్ ఫుడ్ ఆ తర్వాత మాత్రం అనారోగ్యాన్ని ఇచ్చి చివరికి ఆసుపత్రి పాలు చేస్తూ ఉంటుంది. అయితే జంక్ ఫుడ్ తినడం ఎంత డేంజర్ అన్న విషయం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.
ఇలాంటి కొన్ని ఆహారపు అలవాట్లు పెద్ద పేగు క్యాన్సర్ కి కూడా కారణమవుతున్నాయని నిపుణులు అంటున్నారు. పెద్ద పేగు క్యాన్సర్ పట్ల అప్రమత్తం గా ఉండాలని 45 ఏళ్ళు వచ్చాక ఈ వ్యాధి బారిన పడొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మారుతున్న జీవన శైలి పెద్ద పేగు క్యాన్సర్కు కారణం కావచ్చు అంటూ సూచిస్తున్నారు. శారీరక శ్రమ లేక పోవడం, పండ్లు కూర గాయలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం.. తక్కువ ఫైబర్ అధిక కొవ్వు ఆహారం ప్రాసెస్డ్ చేసిన మాంసాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం ఊబకాయం మద్యపానం లాంటి అలవాట్లు కూడా పెద్ద పేగు క్యాన్సర్కు కారణం అవుతున్నాయి.