మొబైల్ వాడితే బ్రెయిన్ క్యాన్సర్ వస్తుందా.. WHO ఏం చెప్పిందంటే?

frame మొబైల్ వాడితే బ్రెయిన్ క్యాన్సర్ వస్తుందా.. WHO ఏం చెప్పిందంటే?

praveen
ఈ మధ్య కాలంలో మొబైల్ వాడకం ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం మనిషి అవసరాలు మాత్రమే తీర్చడానికి వచ్చిన మొబైల్ ఇక ఇప్పుడు మనిషినే బానిసగా మార్చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే అధునాతన టెక్నాలజీతో కూడిన మొబైల్స్ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఇక ప్రతి ఒక్కరు కూడా ఈ స్మార్ట్ ఫోన్ ల
కి తెగ ఆకర్షితులు అవుతున్నారు అయితే ఇంటర్నెట్ సహాయంతో కూర్చున్న చోటు నుంచే ప్రపంచాన్ని మొత్తం చుట్టేయగలుగుతున్నాడు మనిషి.

 దీంతో స్మార్ట్ ఫోన్ వాడుతున్న ఎవ్వరికి కూడా బయట ప్రపంచం తో పనే లేకుండా పోయింది. ఇక ఎన్ని పనులు ఉన్నా సరే సోషల్ మీడియాలో గంటల తరబడి గడిపేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ప్రతి పనిని కూడా మొబైల్ లోనే పూర్తి చేసుకుంటూ ఉండడం గమనార్హం. దీంతో మొబైల్ లేని జీవితాన్ని ఊహించుకోవడానికి కూడా భయపడిపోతున్నాడు మనిషి. అయితే ఇలాంటి పరిస్థితుల మధ్య మొబైల్ ని అతిగా వాడటం కారణంగా.. ఎనో అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు.

 మరి ముఖ్యంగా మొబైల్ ఎక్కువగా వాడితే.. బ్రెయిన్ క్యాన్సర్ నొప్పి ఉంది అని ఎంతో మంది భావిస్తూ ఉంటారు. ఇక ఈ విషయంపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇంట్రెస్టింగ్ విషయాన్నీ వెల్లడించింది. మొబైల్ ఫోన్ వాడటానికి బ్రెయిన్ క్యాన్సర్ ముప్పు పెరగడానికి ఎలాంటి సంబంధం లేదు అంటూ డబ్ల్యూహెచ్వో అధ్యయనం వెల్లడించింది. ప్రపంచంలో వైర్లెస్ టెక్నాలజీ గణనీయంగా పెరిగినప్పటికీ.. బ్రెయిన్ క్యాన్సర్లు పెరుగుదల ఆ స్థాయిలో లేదు అంటూ చెప్పుకొచ్చింది. సుదీర్ఘంగా ఫోన్ మాట్లాడేవారు.. దశాబ్దానికి పైగా మొబైల్ వాడే వారందరికీ కూడా ఇది వర్తిస్తుంది అంటూ తెలిపింది. 1994 నుంచి 2022 వరకు 63 అధ్యయనాలను 11 మంది నిపుణులు పరిశీలించి ఇక ఈ అభిప్రాయానికి వచ్చినట్లు వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: