కండోమ్ వాడుతున్నారా? అయితే HIVకి మించిన జబ్బు ఖాయం ?
సేఫ్ సెక్స్ కి కండోమ్ బాగా ఉపయోగపడుతుందనే విషయం అందరికీ తెలిసిందే. హెచ్ఐవీ వంటి సుఖ వ్యాధులు రాకుండా ఉండాలంటే కండోమ్స్‌ను ఉపయోగించాలని డాక్టర్లు చెబుతుంటారు. ప్రభుత్వాలు కూడా సురక్షిత సెక్స్ కోసం కచ్చితంగా కండోమ్ ఉపయోగించాలని ప్రజల్లో అవగాహన కల్పించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.అయితే మంచి చేసే ఈ కండోమ్‌తో చెడు జరిగే అవకాశం కూడా ఉందని పరిశోధకులు చెబుతున్నారు.హెచ్ఐవీ వంటి ప్రమాదకరమైన సుఖ వ్యాధులకు అడ్డుకట్ట వేయడంలో ఉపయోగపడే కండోమ్స్‌తో ప్రమాదం కూడా పొంచి ఉందని తాజాగా తేలిన అధ్యయనంలో వెల్లడైంది. కండోమ్స్, లూబ్రికెంట్స్‌తో భవిష్యత్తులో వంధ్యత్వం, క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయని తేలింది.
వినియోగదారుల భద్రత వేదిక అయిన మామావేషన్ సంస్థ ఓ అధ్యయనంలో ఈ విషయాలను తెలిపింది. కండోమ్స్ తయారీలో పర్యావరణంతో కలిసిపోని, పీఎఫ్ఏఎస్ వంటి శాశ్వత రసాయాలను ఉపయోగిస్తున్నట్లు ఈ అధ్యయనంలో తెలిపారు.కండోమ్స్ తయారీలో వాడే పర్-అండ్ పాలీఫ్లూలో ఆల్కైల్ సబ్‌స్టాన్సెస్‌ను పీఎఫ్ఏఎస్ కెమికల్స్‌గా పిలుస్తారు. ఇవి ఏన్నేళ్లయినా నీరు, అగ్గి, నూనె ఇంకా గ్రీజు వంటి పదార్థాలతో కలిసిపోవు. అందుకే వీటిని శాశ్వత రసాయనాలు అంటారు. వీటిని కార్పెంటింగ్, పెయింట్లు ఇంకా ఫైర్ ఫైటింగ్ ఫోమ్స్లో ఎక్కువగా ఎక్కువగా వాడుతారు.ఇటువంటి కెమికల్స్ కలిసిన కండోమ్స్, లూబ్రికెంట్స్‌ను వాడితే భవిష్యత్తుల్లో పలు ప్రమాదాలకు దారి తీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వంధ్యత్వం, క్యాన్సర్‌తో పాటు కాలేయం, థైరాయిడ్ సమస్యలు, సంతాన లోపాలు ఇంకా రోగనిరోధక శక్తి తగ్గిపోవడం లాంటి సమస్యలు కచ్చితంగా వస్తాయని చెబుతున్నారు.కలయిక సమయంలో కండోమ్ వాడటం కచ్చితంగా చాలా అవసరం. అలాంటి కండోమ్ వాడినా కూడా ఇలాంటి ప్రాణాంతక సమస్యలు తప్పవంటే కచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే..అందుకే కండోమ్ కోనేముందు వాటిలో ఏమేమి పదార్ధాలు వాడుతున్నారో కచ్చితంగా తెలుసుకోవాలి.