తెల్ల జుట్టు నల్లగా మారే అద్భుత చిట్కా?

Purushottham Vinay

ప్రస్తుత కాలంలో యువతని ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో తెల్ల జుట్టు సమస్య కూడా ఒకటి. ఈ సమస్య చాలా మందిని కూడా ఎంతగానో బాధ పెడుతుంది. దీనికి కారణం చెడు ఆహారం, నీరు, వాతావరణ పరిస్థితుల కారణంగా ఇలా చిన్న వయసులోనే జుట్టు తెల్లగా అవుతుంది. ఈ సమస్యతో చాలా బాధ పడుతున్న యువత ఈ వైట్ హెయిర్‌ను కవర్ చేసుకోవడానికి.. మార్కెట్లో దొరికే అనేక రకాల ఆర్టిఫిషియల్ రంగులు, హెన్నాలు పెట్టుకోవాల్సి వస్తుంది.అయితే ఇలాంటి తిప్పలు ఏవి పడకుండా.. మన డైట్‌లో కొన్ని మార్పులని చేసుకుని, కాస్త తగిన జాగ్రత్తలు కనుక తీసుకుంటే.. సరిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇంకా అలాగే మన ఇంట్లో దొరికే కొన్ని రకాల హోమ్ రెమిడీస్‌తో కూడా జుట్టును చాలా నల్లగా మార్చుకోవచ్చు. మరి అవేంటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.జుట్టుకు కరివేపాకు అనేది చాలా రకాలుగా మేలు చేస్తుంది అని చెప్పొచ్చు.


అందుకే తెల్ల జుట్టు సమస్యతో బాగా బాధ పడేవారు మీ డైట్‌లో కచ్చితంగా కరివేపాకు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఇంకా అలాగే కరివేపాకు జ్యూస్ తాగినా కూడా జుట్టుకు చాలా మంచిదే. ఇంకా అంతే కాకుండా కరివేపాకు ఆయిల్, హెయిర్ ప్యాక్స్ ట్రై చేసినా కూడా చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది.అలాగే నల్ల జీలకర్ర చాలా మేలు చేస్తుంది. ఇక దీన్నే కలోంజీ సీడ్స్ అని కూడా ఉంటారు. వీటిల్లో కూడా చాలా మంచి పోషకాలు ఉంటాయి. వీటితో హెయిర్ ప్యాక్ కనుక వేసుకుంటే కచ్చితంగా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అలాగే గోధుమ గడ్డితో కూడా తెల్ల జుట్టును చాలా నల్లగా మార్చుకోవచ్చు. కాబట్టి ప్రతి రోజూ కూడా మీ భోజనంలో ఒక స్పూన్ గోధుమ గడ్డి ఉండేలా చూసుకోండి. తెల్ల జుట్టు నల్లగా అవ్వాలంటే కచ్చితంగా ప్రతిరోజూ ఉసిరి జ్యూస్ తాగండి. ఉసిరిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టు, చర్మ సమస్యలను తగ్గిస్తుంది. ఉదయం పూట డైలీ 15 మిల్లీ మీటర్ల ఉసిరి జ్యూస్ తాగాలి. చాలా తక్కువ సమయంలోనే మీ జుట్టు నల్లగా, బలంగా, దృఢంగా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: