ఉలవలు ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా?

Purushottham Vinay

ఉలవలు ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. జీర్ణ సమస్యలని ఇవి చాలా ఈజీగా తగ్గిస్తాయి. ఉలవ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పెరిగిన కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి పనిచేస్తుంది. బరువు తగ్గడంలో కూడా ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. యువత, మహిళలు, వృద్ధులు, పిల్లలు సులభంగా ఉపయోగించగల ఆహార ఔషధం ఇది. ఉలవలతో శరీరంపై ఎటువంటి దుష్ప్రభావాలు, సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేని ఆహారంగా అనేక విధాలుగా కూడా ఉపయోగించవచ్చు.ఎందుకంటే వీటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది పేగు కండరాల కదలికల్ని బాగా మెరుగుపరుస్తుంది. అందువల్ల మలం సాఫీగా వచ్చేలా చేసి మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. ఓ కప్పు ఉలవ చారుకు సమానంగా కొబ్బరి నీళ్లు తీసుకుంటే మూత్రంలో మంట నుంచి ఉపశమనం పొందవచ్చు. తరచూ మూత్రంలో మంటతో బాధపడేవారు ఈ చిట్కాని మీరు ట్రై చేయండి. రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొవ్వులను కరిగించడంలో ఉలవలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. తద్వారా గుండెకు రక్తసరఫరా మెరుగుపర్చి హృదయ సంబంధ సమస్యలు రాకుండా కాపాడతాయి. జ్వరంతో పాటు ఆయాసం, దగ్గు వంటి సమస్యలు ఉన్నవారు ఉలవల కషాయం తాగడం మంచిది. 


ఈ కషాయం జ్వరం, దగ్గు వంటి సమస్యలను కూడా ఈజీగా తగ్గిస్తుంది. తినేటప్పుడు ఆగకుండా చాలా మందికి ఎక్కువగా ఎక్కిళ్లు వస్తాయి. అలా వస్తుంటే ఉలవలు తీసుకోవడం చాలా మంచిది. ఉలవలు తినడం ద్వారా ఎక్కిళ్లు రాకుండా ఉంటాయి. బరువు ఎక్కువగా ఉన్నవారు ఉలవలు తింటే చాలా మంచిది. వీటిలోని ఫైబర్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కరిగించడంలో సహాయపడుతుంది. తద్వారా బరువు నియంత్రణలో ఉంచుతుంది. ఉలవలు శరీరంలోని రాళ్లపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. ఇది శరీరంలోని ఏ భాగానైనా రాళ్లు ఏర్పడితే తొలగిస్తుంది. దీని వాడకంతో చక్కెర స్థాయి కూడా చాలా వరకు నియంత్రించబడుతుంది. ఉలవ రక్తంలో చక్కెరను నియంత్రించడంలో చాలా సహాయపడుతుంది. పెరిగిన కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది. ఉలవలు క్రమం తప్పకుండా తీసుకుంటే.. చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు శరీరంపై కనిపిస్తాయి. ఇందులో ఫైబర్, ప్రొటీన్లు చాలా పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరాన్ని బాగా బలపరుస్తుంది. ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: