ఇమ్యూనిటీ కోసం కచ్చితంగా తినాల్సిన ఆహారాలు ఇవే?

Purushottham Vinay

బాడీలో ఇమ్యూనిటీ పెరగాలంటే కచ్చితంగా మనం జింక్ ఎక్కువగా ఉండే ఆహారాలని తినాలి. ఇక జింక్ ఎక్కువగా ఉండే ఆహారాల్లో చీజ్ కూడా ఒకటి. అలాగే పాలలో కూడా జింక్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు ఇతర పాల ఉత్పత్తులను తీసుకుంటున్నా కూడా మనకు జింక్ లభిస్తుంది. కోడిగుడ్లు, డార్క్ చాకొలెట్లను తినడం వల్ల కూడా మనకు పుష్కలంగా జింక్ లభిస్తుంది. ఇలా ఈ ఆహారాలను ఎక్కువగా తింటుంటే జింక్ తగినంతగా లభించి మన రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. దీంతో సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.ఇక శనగలు, ఇతర పప్పు దినుసులను తినడం వల్ల కూడా కూడా మనకు జింక్ అధికంగానే లభిస్తుంది. 100 గ్రాముల పప్పు దినుసుల ద్వారా మనకు రోజుకు కావల్సిన జింక్‌లో 12 శాతం వరకు లభిస్తుంది. ఇక పప్పు దినుసులను తింటే మనకు ఫైబర్ బాగా లభిస్తుంది. అలాగే వీటిల్లో అనేక విటమిన్లు, మినరల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు మనకు తీవ్రమైన జబ్బులు రాకుండా చూస్తాయి.


ఇంకా అలాగే మటన్ లో కూడా జింక్ ఎక్కువగా ఉంటుంది. ఒక కప్పు మటన్ కనుక తింటే మనకు రోజుకు కావల్సిన జింక్‌లో దాదాపుగా 100 శాతం లభిస్తుంది. అలాగే ఈ మాంసంలో మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి కండరాల నిర్మాణానికి, మరమ్మత్తులకు ఎంతగానో ఉపయోగపడతాయి. అందువల్ల మేక మాంసాన్ని తినవచ్చు. కానీ దీన్ని మరీ అతిగా తినకూడదు.ఓట్స్‌లో కూడా జింక్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒక కప్పు ఓట్స్‌ను తినడం ద్వారా మనకు 2.3 మిల్లీగ్రాముల మేర జింక్ లభిస్తుంది. ఓట్స్‌ను మనం అనేక రకాలుగా తినవచ్చు. వీటిని స్మూతీలు లేదా ఓట్ మీల్ రూపంలో తినవచ్చు. వీటిని తినడం వల్ల మనకు జింక్ పుష్కలంగా లభిస్తుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఓట్స్‌ను తింటే జీర్ణక్రియ మెరుగుపడడంతోపాటు కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా తగ్గుతాయి.గుమ్మడి కాయ విత్తనాలు ప్రోస్టేట్ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. అలాగే షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతాయి. ఈ విత్తనాల్లో ఉండే జింక్ ఇమ్యూనిటీని పెంచుతుంది. అందువల్ల ఈ విత్తనాలను ప్రతి రోజూ తినాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: