ఈ లక్షణాలు కనిపిస్తే మీరు ఖచ్చితంగా ఇలా చెయ్యాలి? లేదంటే ప్రాణానికే ప్రమాదం?

Purushottham Vinay

నేటి కాలంలో పని ఒత్తిడి, ఆందోళన, బిజీ బిజీ జీవితం కారణంగా చాలా మంది  వ్యాయామం చేయడం లేదు. వ్యాయామం చేయకపోతే మనకు ఖచ్చితంగా అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.అయితే వ్యాయామం చేయకపోతే మన శరీరం కొన్ని లక్షణాలను తెలియజేస్తుంది. ఈ లక్షణాలు గనుక మీలో ఉంటే ఖచ్చితంగా మీరు వ్యాయామం చేయాలని అర్థం. వ్యాయామం చేయకపోతే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ప్రతి రోజూ వ్యాయామం చేస్తుంటే శరీరంలో ఎలాంటి నొప్పులు ఉండవు. కానీ వ్యాయామం చేయకపోతే మీకు తరచుగా వెన్ను, నడుము ఇంకా అలాగే కాళ్లలో నిరంతరం నొప్పిగా ఉంటుంది. చేతులు, భుజాలు ఇంకా మెడ తదితర భాగాల్లో కూడా ఎప్పుడూ నొప్పి వస్తుంది. ఈ లక్షణాలు మీలో కనిపిస్తుంటే ఖచ్చితంగా మీరు వ్యాయామం చేయాలని అర్థం చేసుకోవాలి. మీరు ప్రతి రోజూ వ్యాయామం చేస్తే ఈ నొప్పులన్నీ తగ్గిపోతాయి.


మీ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయంటే మీరు ఖచ్చితంగా వ్యాయామం చేయాలని అర్థం. ప్రతి రోజూ వ్యాయామం చేయడం ద్వారా కొలెస్ట్రాల్‌ స్థాయిలు ఈజీగా తగ్గుతాయి. దీంతో గుండె కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన ఇంకా మానసిక సమస్యలు ఉన్నాయంటే మీరు ప్రతి రోజూ వ్యాయామం చేయాలని అర్థం. డైలీ వ్యాయామం చేయడం వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది. మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. దీని వల్ల ఒత్తిడి ఇంకా ఆందోళన తగ్గుతాయి. డిప్రెషన్ నుంచి కూడా బయటపడతారు. అలాగే రాత్రిపూట చక్కగా నిద్ర పడుతుంది.చాలామంది కూడా జంక్ ఫుడ్ కు అలవాటు పడుతుంటారు. దీని వల్ల కూడా అస్సలు వ్యాయామం చేయలేక పోతారు.ఇక మీరు గనక జంక్ ఫుడ్ ని ఎక్కువ తీసుకుంటున్నట్టయితే మీరు వ్యాయామం చేయలేరు. కాబట్టి జంక్ ఫుడ్ ను మానేయాల్సి ఉంటుంది. అప్పుడు వ్యాయామంపై ఖచ్చితంగా దృష్టి పెడతారు. ఇలా కొన్ని లక్షణాలను బట్టి మీకు వ్యాయామం అవసరం అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: