మీరు పడుకునే విధానాన్ని బట్టి.. ఎలాంటి వారో తెలుసుకోండి?

praveen
ఈ ప్రపంచంలో ఎలాంటి జీవికి అయినా ఆహారంతో పాటు శరీరానికి తగినంత నిద్ర అనేది ఎంతో అవసరం. ఒక్కోసారి ఆహారం లేకపోయినా పర్వాలేదు కానీ, అదే నిద్ర ఒక్క రోజు గాని లేకపోతే ఇక మనిషి ఎంతో నీరసించి మరుసటి రోజు ఏ పని చేయలేక పోతాడు. అంతేకాకుండా నిద్రలేమి అనేది మనిషికి ఎన్నో రకాలైన రుగ్మతలకు కారణం అవుతుంది. కాబట్టే సగటున మనిషి రోజుకి 6 గంటలకు తక్కువ కాకుండా నిద్రపోవాలి. అయితే ఎలా నిద్రపోవాలి అనేదానిమీద అధ్యయనం చేసినప్పుడు అనేక విషయాలు వెల్లడయ్యాయి.
ముఖ్యంగా మనిషి అనేవాడు రకరకాల భంగిమలలో నిద్రకి ఉపక్రమిస్తాడు. ఒకరు కుడివైపు పడుకుంటే, మరొకరు ఎడమవైపు పడుకుంటారు. కొందరు వెళ్లికెలా పడుకుంటే, మరికొందరు మెలికలు తిరిగి నిద్రిస్తారు. ఇలా నిద్రించే విధానాన్ని బట్టి మనుషుల యొక్క మనస్తత్వాన్ని చెప్పొచ్చు అని సర్వేలు చెబుతున్నాయి. కాబట్టి ఇక్కడ మీరు నిద్రించే విధానాన్ని బట్టి ఇవాళ మీరు ఎలాంటి వారో చెక్ చేసుకుని ఇది సరైన సర్వేనా, లేదా అనేది ఇక్కడ కామెంట్ చేయండి.
వీపుని నేలకానించి కాళ్లు బార్ల చాపుకొని, ఆకాశం వైపు చూస్తూ పడుకునేవారు చాలా ధైర్యవంతులు అని చెబుతున్నారు విశ్లేషకులు. అదే విధంగా కుడి వైపు తిరిగి నిద్రించేవారు చాలా శాంతి పరులు అని, చాలా తెలివిగలవారనే విషయాన్ని సర్వే చెబుతోంది. అదేవిధంగా ఎడమవైపు తిరిగి పడుకునే వాళ్ళు కాస్త అజాగ్రత్త పరులని... జీవితం పట్ల కాస్త నిర్లక్ష్య వైఖరితో ఉంటారని విశ్లేషణలు చెబుతున్నాయి. ఇక మెలికలు తిరిగే ఇష్టమొచ్చినట్టు నిద్రించే వారికి... ఒకే రకమైన అభిప్రాయం ఉండదని, తరచూ తమ ఆలోచనలను మార్చుకుంటారనే విషయాన్ని తాజా సర్వేలు చెబుతున్నాయి. ఇలా సర్వేలు మనిషి నిద్రించే భంగిమలను బట్టి వారు ఎలాంటి వారో తేల్చి చెప్పాయి. విషయం ఏంటంటే... తాజాగా బ్రిటన్ లో ఒక 6000 మంది జనాలను పరీక్షించి ఈ విషయాలను వెల్లడించింది సదరు సర్వే. అయితే ఈ సర్వే వెల్లడించిన విషయాలు అందరికీ వర్తించకపోవచ్చు. ఇక మీరు ఈ లిస్టులో ఏ కోవకు చెందినవారు అనేది ఈ సర్వేను బట్టి నిర్ధారించుకోండి. అదే విధంగా సర్వే పట్ల మీ అభిప్రాయాలను వెల్లడించండి.
గమనిక: ఇది మా వ్యక్తిగత అభిప్రాయం ఎంత మాత్రము కాదు. ఆన్లైన్లో సేకరించిన సమాచారం మాత్రమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: