లివర్ జబ్బు ఈజీగా తగ్గాలంటే..?

Purushottham Vinay
కాలేయం మన శరీరంలో ముఖ్యమైన భాగం. ఎందుకంటే ఇది మన శరీరంలో అనేక ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తుంది. హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో, శరీరాన్ని డిటాక్సిఫికేషన్ చేయడంలో ఇలా అనేక రకాల విధులను కాలేయం నిర్వర్తిస్తుంది.నేటి కాలంలో ఆహారపు అలవాట్ల కారణంగా మనలో చాలా మంది ఫ్యాటీ లివర్ సమస్యలతో బాధపడుతున్నారు. అధిక బరువు, జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, నూనెలో వేయించిన పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది.అయితే తగిన ఆహారాలను తీసుకుంటూ జీవనశైలిలో మార్పు చేసుకోవడం వల్ల కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.


కాలేయ ఆరోగ్యాన్ని కాపాడడంలో వెల్లుల్లి మనకు ఎంతో సహాయపడుతుంది. కాలేయాన్ని సంరక్షించే ఎంజైమ్ లు వెల్లుల్లిలో ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆకుపచ్చ కూరగాయలను, ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి. ఇవి కాలేయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే విటమిన్ సి ఎక్కువగా ఉండే సిట్రస్ జాతి పండ్లను తీసుకోవాలి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కాలేయ ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉత్తమంగా పని చేస్తాయి.నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారికి కాఫీ ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాఫీలో క్లోరోజెనిక్ యాసిడ్ తో పాటు పాలీఫినాల్స్, కెఫిన్, మిథైల్క్సాంథైన్, లిపిడ్లు, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. కాలేయంలో చేరిన కొవ్వును తొలగించడంలో కాఫీ మనకు ఎంతో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. 


కాలేయ ఆరోగ్యానికి కాఫీ మేలు చేసేదే అయినప్పటికి దీనిని తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి. రోజుకు 2 నుండి 3 కప్పుల కాఫీని మాత్రమే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నప్పుడు మనలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.పొట్టలో కుడివైపున నొప్పి, కళ్లు మరియు చర్మం పసుపు రంగులో మారడం, దురద, కడుపులో వాపు, పాదాలల్లో నీళ్లు చేరడం, మూత్రం పసుపు రంగులో రావడం, అలసట, వాంతులు, విరోచనాలు వంటి లక్షణాలు మనలో కనిపిస్తాయి. ఈ లక్షణాలు మనలో కనిపించిన వెంటనే వైద్యున్ని సంప్రదించడం చాలా అవసరం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: