బోర్ గా ఫీల్ అవ్వడం కూడా.. మంచిదేనట తెలుసా?

praveen
సాధారణం గా మనిషి జీవన శైలిలోని ప్రతి విషయం గురించి శాస్త్రవేత్తలు ఎప్పుడూ ఏదో ఒక అధ్యయనం చేస్తూనే ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే సైంటిస్టులు చేసే ఈ అధ్యయనాలలో బయట పడే రిపోర్టులు.. కొన్ని కొన్ని సార్లు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. ఏకంగా రోజు వారి పనులే ఆరోగ్యాని కి మంచి చేస్తాయి అని కొన్ని కొన్ని సార్లు ఇలాంటి అధ్యయనాల  రిపోర్టులు  చెబుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఇలాంటి ఒక  సర్వే రిపోర్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

 సాధారణం గా మనిషిగా పుట్టిన తర్వాత ఎప్పుడో ఒకసారి ఇక బోర్ కొట్టడం లాంటివి జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా బోర్ కొట్టి నప్పుడు ఎవరైనా సరే పడుకోవడం లేదంటే రెస్ట్ తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఇలా బోర్ కొట్టడం కూడా చాలా మంచిదే అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే బోర్ గా ఫీల్ అవ్వడం వల్ల కూడా ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి అని అంటున్నారు నిపుణులు. ఇలా ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు ఫోన్ నీ పక్కన పెట్టి ఇక క్రియేటివిటి పై దృష్టి పెట్టాలి అంటూ సూచిస్తున్నారు.

 బోరింగ్ గా ఫీల్ అయినప్పుడు కొత్త ఆలోచనలు, కొత్త పనులు చేసేందుకు ప్రయత్నించాలి అంటూ చెబుతున్నారు. అంతేకాకుండా బోర్ గా అనిపించినప్పుడు ఇతరులతో మాట్లాడటం వల్ల కమ్యూనికేషన్ పెరిగి ఇక బంధాలు మరింత బలపడే అవకాశం ఉంది అంటూ చెబుతున్నారు. ఏ పని లేనప్పుడు అటు మనసుతో పాటు శరీరానికి కూడా విశ్రాంతి దొరుకుతుందని.. ఇది ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగ పడుతుంది అంటూ నిపుణులు చెబుతూ ఉండడం గమనార్హం. ఇలా బోర్ గా ఫీల్ అవ్వడం కూడా మంచిదే అంటూ సూచిస్తున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: