మనం మురికినీటి కూరగాయలే తింటున్నామా?

Chakravarthi Kalyan
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిల్లో కాలుష్య కాసారాలుగా మారిన చెరువుల నీటితో కూరగాయలు, ఆకుకూరల సాగును అడ్డుకోవడానికి తక్షణం చర్యలు చేపట్టాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మురుగునీటితో సాగైన కూరగాయలు, ఆకు కూరలు ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని, అందువల్ల అవి మార్కెట్లోకి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 13 చెరువుల దుస్థితిపై అడ్వొకేట్ కమిషన్ ఇచ్చిన నివేదికలోని సూచనల అమలుపై 4 వారాల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కార్యాచరణ నివేదికను ఫొటోలతో సహా సమర్పించాలని ఆదేశించింది.

హైదరాబాద్‌ మహా నగరంలోని చెరువుల ఆక్రమణలపై చర్యలు తీసుకోకపోవడంపై 2007లో పిల్‌ దాఖలైంది. ఈ ప్రజాప్రయోజన వ్యాఖ్యపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె. అనిల్ కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ధర్మాసనం ఏర్పాటు చేసిన అడ్వోకేట్ కమిషన్ మహానగరంలో పర్యటించింది. పలు చెరువుల దుస్థితిపై ఫోటోలతో సహా నివేదిక సమర్పించింది. పలు సూచనలు చేసింది. చాలా చెరువులు అక్రమణలకు గురయ్యాయని చెత్తాచెదారం. మురుగునీటితో దుర్గందభరితంగా తయారయ్యాయని అడ్వోకేట్ కమిషన్ పేర్కొంది.

ఈ చెరువుల్లోని మురుగు నీళ్లతో సాగు చేసిన ఆకు కూరలు, కూరగాయలతోపాటు చేపలను వినియోగిస్తున్న ప్రజల ఆరోగ్యాలపై ప్రభావం చూపిస్తోందని తేల్చింది. వ్యర్థాలను తొలగించడం, పూడిక తీయడం, ఆక్రమణలను తొలగించడంతోపాటు నాలాలను పరిరక్షించి నీటి రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాల్చిన అవసరం ఉందని పేర్కొంది. చెరువుల ఆక్రమణ, అక్రమ నిర్మాణాలు తదితర కేసుల సత్వర పరిష్కారానికి హైకోర్టు పరిధిలో గ్రీన్ బెంచ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం పేర్కొంది.

ఎఫ్‌టీఎల్‌ నిర్ధారణ శాస్త్రీయంగా చేసి తుది నోటిఫికేషన్ ఇవ్వాలని... ఆక్రమణదారులపై చర్యలు తీసుకునేలా నీటిపారుదల శాఖకు తగిన అధికారాలు కల్పించాలని అడ్వకేట్ కమిషన్ నివేదికలో తెలిపింది. అడ్వకేట్ కమిషన్ నివేదికను అమలు చేయాలని సూచించింది.  చెరువుల వారీగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ  విచారణను ఏప్రిల్ 29వ తేదీకి వాయిదా వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: