ఆరోగ్యం కోసం ఖచ్చితంగా తినాల్సిన ఆకుకూర ఇదే?

Purushottham Vinay
మనం ఆకుకూరలు ఎక్కువగా తినడం వల్ల ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటాము.కళ్ళ సమస్యలు ఉన్నవాళ్లు ఆకుకూరాలు ఎక్కువగా తినడం వల్ల సమస్య తగ్గుతుంది.తోటకూర,బచ్చలకూర,మెంతికూర,చుక్కకూర,పాలకూర,గోంగూర వంటి ఆకుకూరాలు మనం తరచూ తింటూ ఉంటాము.అయితే ఇప్పుడు వీటిలో మనం పాలకూరతో కొత్త రెసిపీ గురించి తెలుసుకుందాం.ఎప్పుడు రొటీన్ గా పాలకూర పప్పు, పాలకూర వేపుడు, కాకుండ పాలకూర ఉల్లిగడ కారంతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం.రెండు కట్టలు పాలకూర తీసుకొని బాగా కడిగి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు నాలుగు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా చేసి అందులో ఒక పది వెల్లుల్లి రెబ్బలని వేసుకోవాలి.ఇవి మిక్సీ లో వేసుకొని ఒక స్పూన్ సాల్ట్,రెండు మూడు స్పూన్ ల కారం కూడా వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి.మరీ మెత్తగా ఉండకూడదు.ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కర్రీ బౌల్ పెట్టుకొని  కావాల్సినంత ఆయిల్ వేసి బాగా కాగనివ్వాలి,అందులో ఒక స్పూన్ జీలకర్ర మూడు ఎండుమిర్చి వేసుకోవాలి.


తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ కారం పేస్ట్ ని కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి.ఈ ఉల్లిపాయ మిశ్రమం సరిగా వేగకుంటే కర్రీ టేస్ట్ తగ్గుతుంది.అందుకే ఆయిల్ పైకి తేలేవరకు వేగనివ్వాలి.ఇలా రోస్ట్ అయినా ఉల్లిపాయ కారంలో ముందుగా తరిగి పెట్టుకున్న పాలకూరని వేసుకోవాలి.పాలకూరలో వాటర్ మొత్తం పోయేలా బాగా సన్నని మంట మీద కూర అడుగు అంటకుండా కలుపుకోవాలి.కర్రీ నుండి ఆయిల్ సపరేట్ అయ్యి పైకి తేలే వరకు ఉడికించుకోవాలి.ఆయిల్ సెపరేట్ అయినా తర్వాత ఫైనల్ గా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.అంతే నిముషాలలో ఎంతో రిచిగా వుండే పాలకూర ఉల్లిపాయ కారం రెడీ.పాలకూరలో క్యాల్షియంఎక్కువగా ఉంటుంది. పాలకూరని తరచూ తినడం వల్ల బీపీ డయాబేటీస్ సమస్యలు తగ్గుతాయి.ఎముకలు బలంగా ఉంటాయి.పెరిగే పిల్లలకి ఈ పాలకూర అలవాటు చేస్తే ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు.ఈ పాలకూరలో క్యాల్షియంతో పాటు విటమిన్ ఎ, విటమిన్ సి కూడా పుష్కళంగా ఉన్నాయి.కనుక వారానికి రెండు మూడు సార్లు దీన్ని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: