నిద్రలో ఈ అలవాటు ఉందా.. అయితే డేంజర్లో పడ్డట్టే?

praveen
ప్రతి మనిషి జీవితంలో నిద్ర అనేది ఒక భాగమే అన్న విషయం తెలిసిందే. పగలంతా పనిచేసిన వారు రాత్రి కాస్త కునుకు తీసి హాయిగా నిద్రపోయారు అంటే చాలు ఇక ఉదయాన్నే మళ్ళీ ఎంతో ఫ్రెష్ గా నిద్ర లేస్తూ కొత్తగా రోజును ప్రారంభిస్తూ ఉంటారు. అయితే మంచి నిద్ర మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది అని అటు ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే  ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు దాదాపు 7 గంటల పాటు నిద్రపోవాలి అని సూచిస్తూ ఉంటారు.

 అయితే ఇటీవల కాలంలో మాత్రం ఎవరూ పెద్దగా నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు.  నిద్రపోయే సమయాన్ని కూడా మొబైల్ వాడకానికి  లేదంటే ఇంకా ఏదైనా చేయడానికి ఉపయోగించుకుంటున్నారు. మహా అయితే రెండు మూడు గంటలు పడుకోవడం మాత్రమే చేస్తూ ఉన్నారు. తద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలను కూడా కొని తెచ్చుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే కొంతమంది ఇక వైద్యులు సూచించినట్లుగానే ఎక్కువ సమయం నిద్ర పోయినప్పటికీ ఇక నిద్రపోయే సమయంలో చేసే పనులతో చివరికి ప్రమాదంలో పడిపోతున్నారు.

 అయితే చాలా మందికి నోరు తెరిచి నిద్రపోయే అలవాటు ఉంటుంది. అయితే ఇలాంటి అలవాటు ఉన్నవారు డేంజర్ లో పడ్డట్టే అని వైద్య నిపుణులు  సూచిస్తున్నారు. నోటిలో గాలిని వడపోసే వ్యవస్థ ఉండదు. అందుకే నోటితో శ్వాస తీసుకోకూడదు అని వైద్యులు చెబుతున్నారు  ఒకవేళ ఇలా నిద్రపోయిన సమయంలో నోటితో గాలి తీసుకుంటే.. వారిలో శరీరానికి ఆక్సిజన్ సరిపడా అందకపోవడంతో పాటు రక్త ప్రసరణ పై కూడా ప్రభావం పడుతుందట. ఇక లాలాజలం ఆగిపోయి బ్యాక్టీరియా పెరుగుతుందని.. ఇక ఈ బ్యాక్టీరియా ఊపిరితిత్తులపై ఒత్తిడి పెంచడంతోపాటు ఇక దంతాలను పాడయ్యేలా చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే నిద్ర పోయేటప్పుడు నోరు తెరిచి నిద్రపోకూడదు అంటూ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: