హనుమంతుడే వైద్యుడు.. అక్కడికి వెళ్తే క్యాన్సర్ కూడా నయమవుతుందట?

praveen
దేవుడు నిజంగానే ఉన్నాడా.. మనిషికి సమస్య వస్తే నేను ఉన్నాను అంటూ భరోసా ఇస్తాడా అంటే.. నాస్తికులు కొంతమంది శాస్త్రవేత్తలు దేవుడు లేడు అని చెబుతారు. కానీ ఎక్కువ మంది మాత్రం దేవుడు ఉన్నాడు అని బల్లగుద్ది మరి చెబుతూ ఉంటారు. నీకు దేవుడి అవసరం ఉన్నప్పుడు తప్పకుండా నీ కోసం వస్తాడు అని చెబుతూ ఉంటారు. దేవుడు ఉన్నాడు అనే నమ్మకం మనుషుల్లో బలంగా ఉంది. కాబట్టి ప్రస్తుతం ఎన్నో మసీదులు గుళ్ళు చర్చిల్లో పూజలు జరుగుతున్నాయి. నేటి సభ్య సమాజంలో నిజంగానే దేవుడు ఉన్నాడు అన్నదానికి నిరూపించే విధంగా కొన్ని ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి.

 ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. ఇటీవల కాలంలో చాలా మంది క్యాన్సర్ అనే మహమ్మారి బారిన పడుతున్నారు. ఎన్ని మందులు వాడిన ఆసుపత్రులు చుట్టూ తిరిగిన క్యాన్సర్ ద్వారా నుంచి బయటపడలేకపోతున్నారు. కానీ అలాంటి వారు మధ్యప్రదేశ్ లో ఉన్న ఒక గుడికి వెళ్తే మాత్రం రోగాలు మటుమాయమవుతాయట. ఆ గుడి పేరు హనుమాన్ క్లినిక్. అదేంటి అక్కడ హనుమాన్ అనే పేరు పెట్టుకునే డాక్టర్ ఉంటాడా అంటారా.. డాక్టర్ కాదు సాక్షాత్ ఆంజనేయస్వామి అక్కడ వైద్యం చేస్తాడని స్థానికులందరూ కూడా చెబుతూ ఉంటారు. మధ్యప్రదేశ్లోని బెండ్ దండ్రువ దానయ్ పేరుతో ఒక హనుమాన్ ఆలయం ఉంది.

 ఈ గుడిలో ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు వస్తూ ఉంటారు. ఇక ఆంజనేయస్వామిని డాక్టర్ బజరంగబలిగా పూజిస్తారు. స్వామినీ దర్శించుకుని ఆయన పాదాల వద్ద ఉన్న నీరు తాగితే క్యాన్సర్ లాంటి రోగాలు కూడా నమ్ముతాయట. దీంతో ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒకసారైనా ఈ ఆలయాన్ని దర్శించుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు వరకు అక్కడ హనుమంతుడికి పూజలు చేసే పూజరులు, అక్కడికి వచ్చి వెళ్లిన భక్తులు కూడా ఇలా ఈ హనుమంతుడని దర్శించుకుంటే పెద్ద పెద్ద వ్యాధులు కూడా నయమవుతాయని చెబుతూ ఉండడం గమనార్హం. క్యాన్సర్ లాంటి మహమ్మారి కూడా ఇప్పటివరకు ఎంతోమంది కి తగ్గిందట. గతంలో ఒక భక్తుడికి స్వయంగా వైద్యం చేయడానికి హనుమంతుడు వైద్యుడు రూపంలో వచ్చాడని ప్రతితి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: