డ్రింక్ చేసిన తర్వాత.. టాబ్లెట్స్ వేసుకోవచ్చా?

praveen
మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఎందుకో మద్యం తాగే అలవాటును మాత్రం వదులుకోలేకపోతున్నారు జనాలు. ఒకప్పుడు మద్యం తాగే వారిని కాస్త తేడాగా చూసేవారు. కానీ ఇప్పుడు ఎవరైతే మద్యం అలవాటు లేని వారు ఉంటారో వారిని విచిత్రంగా చూడటం చేస్తూ ఉన్నారు. అంతలా నేటి సభ్య సమాజం తీరు మారిపోతుంది. అయితే కొంతమంది మద్యానికి బాగా అలవాటు పడి చివరికి ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా కొనితెచ్చుకుంటున్నారు. ఇంకొంతమంది మద్యం తాగిన తర్వాత చేయకూడని పనులు చేసి ప్రమాదాల బారిన పడుతూ ఉన్నారు.

 అయితే మద్యం అలవాటు ఉన్న ప్రతి ఒక్కరిలో ఉండే ఒకే ఒక అనుమానం డ్రింక్ చేసిన తర్వాత టాబ్లెట్స్ వేసుకోవచ్చా లేదా అని. ఈ డౌట్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మరి ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్, పారిసిట్మాల్ లాంటి టాబ్లెట్స్ వేసుకుంటే ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో? ప్రాణాల మీదికి వస్తుందేమో? అని ఎంతో మంది భయపడిపోతూ ఉంటారు. అయితే ఆల్కహాల్ తీసుకున్న తర్వాత మందులను వాడటం ముమ్మాటికి తప్పే అని చెబుతున్నారు నిపుణులు. ఇది తక్షణ దుష్ప్రభావాలను చూపిస్తుంది అంటూ హెచ్చరిస్తున్నారు. అందుకే డ్రింక్ చేసిన తర్వాత ఏ సమస్య కోసం టాబ్లెట్ వేసుకున్న అది సమస్యను పరిష్కరించకపోగా.. కొత్త సమస్యకు కారణం అవుతుంది అంటూ చెబుతున్నారు.

 అందుకే డ్రింక్ చేసిన తర్వాత ఎలాంటి మాత్ర కానీ మందు కానీ వేసుకోవడం ఏ మాత్రం మంచిది కాదు అని చెబుతున్నారు నిపుణులు. అయితే కొన్ని కొన్ని సార్లు డ్రింక్ చేసిన తర్వాత టాబ్లెట్స్ వేసుకుంటే రియాక్షన్ అప్పటికప్పుడు కనిపించక పోయిన.. మరుసటి రోజు అయినా చివరికి అది ప్రమాదకరంగా మారిపోతుంది అంటూ చెబుతున్నారు. ఎందుకంటే ఒకసారి మద్యం తాగిన తర్వాత దాదాపు 24 నుంచి 25 గంటల పాటు మన శరీరంలో ఆల్కహాల్ అలాగే ఉంటుందట. అందుకే మద్యం తాగడానికి ముందే టాబ్లెట్స్ వేసుకోవాలా వద్దా అని ఆలోచించుకుని డ్రింక్ చేస్తే బెటర్ అని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: