మైగ్రేన్ నొప్పికి చిటికలో రిలీఫ్ నిచ్చే ఆయిల్స్ ఇవే..!

Divya
ఈ మధ్యకాలంలో చాలా మంది మైగ్రేన్ నొప్పికి బారిన పడుతూ ఉన్నారు.ఇందులో ముఖ్యంగా 20 నుంచి 60 ఏళ్ల వయసుగల స్త్రీలే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు.ఇది మొదటగా సాధారణ తలనొప్పిగా ఉన్నప్పటికీ,క్రమంగా అది వారి తలను సమ్మటతో బాధ నట్టు,బండకేసి బాదినట్టు,అంత బాధ కలిగిస్తూ ఉంటుంది.ఇంకా చెప్పాలంటే చాలామంది సూసైడ్ థింకింగ్ కూడా చేస్తారు.
స్త్రీలలో ఇది ఎక్కువగా రావడానికి కారణం వారు అతిగా ఆలోచించడం,అతిగా డిప్రెషన్ కి గురి కావడం,సరైన మోతాదులో నీరు తాగకపోవడం,సరైనా క్రమంలో ఆక్సిజన్ అందకపోవడం,మెదడు నాళాలు వాయడం వంటి సమస్యల వల్ల మైగ్రేన్ అధికంగా వస్తుంది.ఇలా మైగ్రేన్ వచ్చిన వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా తగ్గిపోతూ ఉంటుంది.ఒక్కొక్కరికి 10 నిమిషాల పాటు తలనొప్పిస్తే, కొంతమందికి 10 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంటుంది.అలా కాకుండా చిటికెలో ఉపశమనం కలగాలంటే కొన్ని రకాల ఆయిల్ ని పిలిస్తే చాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.మరి అవి ఏంటో తెలుసుకుందాం పదండి..
లావెండర్ ఆయిల్..
లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ లో యాంటీమైక్రోబయల్ యాక్టివిటీ,యాంజియోలైటిక్,యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటినోసైసెప్టివ్ మరియు యాంటీ ఆక్సిడెంట్ వంటి ఔషధ గుణాలు ఎన్నో పుష్కలంగా లభిస్తాయి.మైగ్రేన్  తో బాధపడేవారు లావెండర్ ఆయిల్ ని వేడి నీళ్లలో వేసి ఆవిరి పట్టుకోవడం వల్ల మైగ్రేన్ తొందరగా తగ్గిపోతుంది.
పిప్పర్మెంట్ ఆయిల్..
పిప్పర్‌మెంట్‌ ఆయిల్‌లో శీతలీకరణ,అనాల్జేసిక్‌ లక్షణాలు పుష్కలంగా లభిస్తాయి.ఇది టెన్షన్‌ తలనొప్పి, మైగ్రేన్‌ నుంచి తొందరగా ఉపశమనం ఇస్తుంది.మీరు ఈ తలనొప్పితో బాధపడుతుంటే,పిప్పర్‌మెంట్‌ ఆయిల్‌ను వాసన చూడటం కానీ, తలపై రెండు చుక్కలు అప్లై చేయడం ద్వారా కానీ మైగ్రెన్ కు తొందరగా ఉపశమనం లభిస్తుంది.
యూకలిప్టస్ ఆయిల్..
యూకలిప్టస్ ఆయిల్ లో యాంటీ బాక్టీరియల్,యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉండటం వలన శతాబ్దాలుగా వీటి ఆకులను ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు. మైగ్రేన్ తో తలబాదుకొనేవారు వెంటనే వేడి నీళ్లలో ఐదారు చుక్కల యూకలిప్టస్ ఆయిల్ వేసి ఆవిరి తీసుకోవడం వల్ల వెన్ చిటికలో మైగ్రేన్ తగ్గిపోతుంది.
మీరు కూడా మైగ్రేన్ తలనొప్పి తో బాధపడుతూ ఉన్నారా.అయితే వెంటనే ఈ ఆయిల్ అప్లై చేసుకోవడం కానీ,దీనితో ఆవిరి పట్టుకోవడం కానీ చేయడం మొదలుపెట్టండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: