తలనొప్పిని తక్షణమే తగ్గించే చిట్కాలు?

Purushottham Vinay
తల నొప్పిని తక్షణమే తగ్గించే చిట్కాలు ?


తల నొప్పిని తట్టుకోవడం చాలా కష్టం అవుతుంది.ఈ చలి కాలంలో కొందరికి తలనొప్పి సమస్య తీవ్రమవుతుంది. ఎన్ని మందులు వేసుకున్నా కానీ నొప్పి అస్సలు తగ్గదు. అయితే, తీవ్రమైన తల నొప్పిని సైతం తగ్గించే టిప్స్ మన వంటింట్లోనే ఉన్నాయి.మనం నిత్యం వంటింట్లో వినియోగించే పదార్ధాలు తలనొప్పిని క్షణాల్లో మాయం చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మరి తలనొప్పి నివారణకు ఏం చేయాలో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం..ఎన్ని పనులు చేసినా నొప్పి తగ్గకపోతే.. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. దీని ద్వారా తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.వంటల్లో వేసే లవంగాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఆయుర్వేదంలో లవంగాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. లవంగాలకు శరీరంలో వాపును ఇంకా నొప్పిని తగ్గించే లక్షణం ఉంది. 



అందుకే.. లవంగాలను నమిలి తింటే చాలా రోగాలు ఈజీగా నయం అవుతాయి. ఈ లవంగాలను నీటిలో మరిగించి.. ఆ నీటిని తాగితే ఖచ్చితంగా మంచి ప్రయోజనం ఉంటుది. లేదంటే ఒక టవల్‌లో లవంగం మొగ్గలను కట్టేసి దాని వాసన చూసినా కూడా ప్రయోజనం ఉంటుంది.అలాగే తులసి ఆరోగ్యానికి చాలా మంచిది.ఆయుర్వదపరంగా కూడా దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. తులసి ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. ముఖ్యంగా.. నీటిలో తులసి వేసి, అల్లం వేసి మరిగించి.. ఆ నీటిని కనుక తాగితే.. చాలా రకాలుగా ప్రయోజనం కలుగుతుంది. ఇక తలనొప్పితో బాధపడుతున్న వారు ఈ నీటిని తాగడం వలన ప్రయోజనం ఉంటుంది.లవంగం నూనెతో మసాజ్ చేసినా కూడా తలనొప్పి నుంచి చాలా సులభంగా ఉపశమనం కలుగుతుంది. ఇక నుదిటిపై మసాజ్ చేసి.. తలకు ఒక క్లాత్ కట్టుకుని కాసేపు పడుకుంటే.. తలనొప్పి ఈజీగా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: