కొంత మందిలో మైగ్రేన్ అనేది నిరంతర సమస్యగా ఉంటుంది. కాలం మారినప్పుడల్లా.. చలి, గాలి తల నరాలపై ప్రభావం చూపిస్తాయి. ఇలా తల నరాలు ఒత్తిడికి గురైనప్పుడు ఈ మైగ్రేన్ సమస్య ఎటాక్ చేస్తుంది. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ సమస్య నుంచి చాలా ఈజీగా తప్పించుకోవచ్చు. మరి అవేంటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.మైగ్రేన్ సమస్యతో ఇబ్బంది పడేవారు ఖచ్చితంగా వీలైనంత వరకూ చుట్టూ ఉన్న వాతావరణం కూడా ప్రశాంతంగా.. ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకా అలాగే ఇంట్లో కూడా ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఖచ్చితంగా ఎక్కువగా కాంతి, ఎండ లేకుండా చూసుకోవాలి. ఇంకా అలాగే ఇంట్లో మంచి సువాసన వచ్చే రూమ్ స్ప్రేస్ లేదా.. ఎసెన్సియల్ ఆయిల్స్ ని స్ప్రే చేస్తూ ఉండాలి. ఇలా చిన్న చిన్న మెళకువలు పాటిస్తే.. మైగ్రేన్ ని ఈజీగా అదుపులో ఉంచుకోవచ్చు.
మైగ్రేన్ రాకుండా ఉండాలంటే.. ముందు సరైన నిద్ర ఉండాలి. చాలీ చాలని నిద్రతో కేవలం మైగ్రేనే కాకుండా.. ఇతర దీర్ఘకాలిక సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ప్రతి రోజూ ఒకే సమయానికి నిద్ర పోయేటట్టుగా.. లేచేటట్టుగా ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి.మన శరీరం ఆరోగ్యంగా ఉండాలన్నా.. చక్కగా పని చేయాలన్నా నీరు చాలా ముఖ్యం. కనీసం రోజుకు 7 నుంచి 8 గ్లాసుల నీటిని తాగాలని వైద్యులు పలుమార్లు సూచిస్తున్నారు. ఎక్కడికైనా.. వాటర్ బాటిల్ తీసుకువెళ్లాలని చెబుతున్నారు. ఇలా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచితే.. మైగ్రేన్ లు కొంత వరకు అదుపులోకి వస్తాయి.ప్రస్తుత కాలంలో చాలా మంది క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే పనులు ఎక్కువ అయి.. తీవ్రంగా ఒత్తిడికి గురవుతున్నారు. ఇలా ఒత్తిడి ఎక్కువ అయ్యే క్రమంలో.. వీరికి మైగ్రేన్ ఎటక్ చేస్తుంది. మైగ్రేన్ ఎటాక్ అయ్యే వాళ్లు.. ఖచ్చితంగా ఒత్తిడిని దూరం చేసుకోవాలి.