దోమలు బెడదని న్యాచురల్ గా తగ్గించే టిప్?

Purushottham Vinay
ఎండాకాలం పొయ్యి వానా కాలం రావటం వల్ల ఇంట్లో దోమలు రావటం ఎక్కువ అయింది. వీటిని అశ్రద్ద చేస్తే ఖచ్చితంగా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి.దోమలను బయటకు తరమటానికి ఇప్పుడు చెప్పే చిట్కా చాలా బాగా పనిచేస్తుంది.ALL Out, GOOD night ఇలా చాలా రకాల పేర్లతో మార్కెట్లో లభించే దోమల నివారణ మందులను ఎక్కువ కాలం వాడడం వల్ల శ్వాసకోస వ్యాధులు, మానసిక వ్యాధులు తలెత్తే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. దోమ కాటు వలన దురద ఇంకా శరీరం పైన దద్దురులు ఎక్కువగా వస్తాయి. కొన్ని సందర్భాలలో ఈ కాట్లు మచ్చలలాగా కూడా ఏర్పడతాయి.అందుకే సహజ సిద్ధమైన మార్గాల్లో మాత్రమే దోమలని తరిమికొట్టడం మంచిది. ఇప్పుడు అందుకు ఒక అద్భుతమైన చిట్కా ఉంది. దాని గురించి మనం ఇప్పుడు తెల్సుకుందాం.



ఈ చిట్కా కోసం 5 ఇంగ్రిడియన్స్ చాలా అవసరం అవుతాయి. వేపాకులు 50 గ్రాములు తీసుకొని వాటిని మెత్తని పొడిగా చేసుకోవాలి.ఈ 50 గ్రాముల వెలుల్లి తొక్కలను బాగా ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి.లాంగ్ పెప్పర్ 2, 25 గ్రాముల లవంగాలు ఇంకా పలావ్ ఆకులూ రెండింటిని తీసుకోని మెత్తని పొడిగా గ్రైండ్ చేసుకోవాలి.అలాగే వేపాకుల పొడి,వెల్లుల్లి తొక్కల పొడి,లవంగం,పెప్పర్,పలావ్ ఆకుల పొడి అన్నింటిని బాగా కలిపి నీటిని చేర్చుతూ మెత్తని పేస్ట్ లాగా తయారుచేయాలి.తరువాత ఈ పేస్ట్ ని చిన్న చిన్న దిమ్మలుగా చేయాలి. వీటిని మూడు గంటల పాటు అలాగే ఆరబెట్టాలి. అవి బాగా ఆరాక గాలి చొరబడని డబ్బాలో వేసి వాటిని నిల్వ ఉంచుకోవాలి. ఇక దోమలు ఉన్న ప్రదేశంలో ఒక దిమ్మను పెట్టి వెలిగిస్తే ఆ పొగకు దోమలు చాలా ఈజీగా పారిపోతాయి. ఈ టిప్ ఖచ్చితంగా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.కాబట్టి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. న్యాచురల్ గా వాటిని ఇంట్లో నుంచి తరిమికొట్టండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: