మీ పిల్లలు వయసుకు తగ్గ హైట్ పెరగాలంటే తినవలసిన ఆహారాలివే..!

Divya
ఈ మధ్యకాలంలో పిల్లలు జంక్ ఫుడ్ కు అలవాటు పడి,సరైన పోషకాహారం తినకపోవడం వల్ల,వయసుకు తగ్గ హైట్ పెరగలేకపోతుంటారు.అంతేకాక వాళ్ళ స్టామినా కూడా చాలా తగ్గిపోతూ ఉంటుంది.ఏ చిన్న పనిచేసినా తొందరగా అలిసి చతికలా పడుతూ ఉంటారు.అలాంటి పిల్లలకు బోన్స్ స్ట్రెంత్ పెంచి,మంచి హైట్ పెంచేందుకు ఉపయోగపడే కొన్ని ఆహారాలు తప్పకుండా ఇవ్వాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.అవేంటో తెలుసుకుందాం పదండీ..

బాదాం..
వయసు తగ్గ హైట్ లేని పిల్లలకు రోజు బాదాం ఇవ్వడం వల్ల,వారి హైట్ ని ఈజీగా పెంచవచ్చు ఇందులోని విటమిన్ ఏ,మెగ్నీషియం,మాంగనీస్,అధిక ఫైబర్ వంటి ఖనిజాలు అధికంగా లభించడం వల్ల,తొందరగా హైట్ పెరగడానికి దోహదపడతాయి.

స్వీట్ పొటాటో..
స్వీట్ పొటాటో తరచూ పిల్లలకి ఇవ్వడం వల్ల ఇందులోనే విటమిన్ ఏ బోన్స్ట్రెంత్ కి ఉపయోగపడి, తొందరగా హైట్ పెరగడానికి దోహదపడతాయి. అంతేకాక స్వీట్ పొటాటో తినడం వల్ల,జీర్ణశక్తి మెరుగుపడుతుంది.

సాల్మన్ ఫిష్..
ఇందులోని  అధికంగా ఉన్న ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ గుండె హెల్త్ కాపాడటమే కాకుండా,ఎముకల బలము మరియు పెరుగుదలకు దోహదపడతాయి.కావున ఎదిగే పిల్లలకు వారానికి ఒకసారైనా సాల్మన్ ఫిష్ ఇవ్వడం చాలా మంచిది.

బీన్స్..
ఫైబర్ అధికంగా ఉన్న బీన్స్ తీసుకోవడం వల్ల,జీర్ణ క్రియాశక్తి మెరుగుపడటమే కాకుండా పెరుగుదల హార్మోని పెంచడంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.ఈ హార్మోన్ సక్రమంగా రిలీజ్ అయితేనే పిల్లల్లో గ్రోత్ కనబడుతుంది.అంతేకాక మెదడు కణజాలాన్ని కూడా వృద్ధి చేస్తుంది.కావున తరచూ పిల్లలకు బీన్స్ ఇవ్వడం చాలా ఉత్తమం.

పెరుగు..
పెరిగే పిల్లల కోసం రోజు పెరుగు ఇవ్వడంతో అందులోని ప్రోబయాటిక్స్ వాళ్ళు పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడతాయి.మరియు వారి జీర్ణక్రియ రేటును పెంచి,ఏమి తిన్నా,ఇట్టే అరిగేందుకు ఉపయోగపడుతుంది.

బెర్రీస్..
పెరిగే పిల్లలకు రోజు బెర్రీస్ పెట్టడం వల్ల,వారి పెరుగుదల రేటు సక్రమంగా ఉంటుంది.ఇందులో కొల్లాజేన్ అనే సమ్మేళనం పుష్కలంగా లభించి,వారి హైట్ ని పెంచడంలో సహాయపడుతుంది.మరియు వారి ఇంటర్నల్ హెల్త్ కూడా మెరుగుపడుతుంది.కావున మీరు ఈ సమస్యతో బాధపడుతూ ఉంటే,పైన చెప్పిన ఆహారాలన్నీ మీ పిల్లలకు ఏదో ఒక రూపంలో ఇవ్వడం మొదలుపెట్టండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: