థైరాయిడ్ వ్యాధి విషయంలో మనం తీసుకునే ఆహారం కూడా ఖచ్చితంగా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.నిజానికి ఎంత పోషకాహారం తీసుకున్నా ఇంకా సమతుల్య ఆహారం అలవాటు చేసుకున్నా.. అది ఈ థైరాయిడ్ సమస్యను పరిష్కరించలేదు. కానీ వైద్యుల సూచన మేరకు కొన్ని మందులు వాడుతూ దానితో పాటు మంచి ఆహారం తీసుకుంటే ఫలితం కచ్చితంగా కనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని పండ్లు ప్రతి రోజూ తీసుకోవడం వల్ల థైరాయిడ్ సమస్యను తగ్గించవచ్చు.పైనాపిల్‌లో అధిక మొత్తంలో విటమిన్ సీ ఇంకా మాంగనీస్ ఉంటాయి. ఈ రెండు పోషకాలు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి మన శరీరాన్ని ఈజీగా రక్షిస్తాయి. ఈ పండులో విటమిన్ బీ కూడా ఉంటుంది. ఇది థైరాయిడ్ లక్షణాలలో ఒకటైన అలసటను పోగొట్టడంలో చాలా బాగా సహాయపడుతుంది.అలాగే ఈ పైనాపిల్ అనేది క్యాన్సర్, ట్యూమర్, మలబద్ధకంతో బాధపడేవారికి కూడా మంచిది.అలాగే విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్న నారింజలు ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరిస్తాయి.ఇవి మీ కణాలను మరింత దెబ్బతినకుండా కాపాడతాయి. ఫ్రీ రాడికల్స్ అనేవి థైరాయిడ్ గ్రంధిలో మంటను కలిగిస్తాయి. ఇంకా దాని పనితీరును ప్రభావితం చేస్తాయి.ఈ విటమిన్ సీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది.ఇంకా కొలెస్ట్రాల్ స్థాయిని నిర్వహిస్తుంది.
అలాగే మన చర్మం దెబ్బతినకుండా చేస్తుంది.ఇంకా గాయాలను నయం చేయడంలో కూడా సహాయపడుతుంది.అలాగే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల, బెర్రీలు మీ థైరాయిడ్ సమస్యకు బాగా పనిచేస్తాయి. ఎందుకంటే ఇవి మన థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని ఉత్తేజపరిచి, సజావుగా పనిచేసేలా చేస్తాయి. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ నష్టం నుండి మనలను రక్షించే విటమిన్లు ఇంకా ఖనిజాలను కూడా బెర్రీస్ కలిగి ఉంటాయి.అందుకే మీరు మధుమేహం, బరువు పెరగటంతో ఎక్కువగా బాధపడుతున్నట్లయితే, బెర్రీలు మీకు బెస్ట్ ఎంపికలుగా నిలుస్తాయి. అందుకే ప్రతిరోజూ స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ లేదా ఇండియన్ జుజుబ్ (బెర్) లేదా వైల్డ్ బ్లూబెర్రీస్ (ఫాల్స్) భాగాన్ని తీసుకోండి.అలాగే యాపిల్ ఆరోగ్యకరమైన ఆహారాలలో ఒకటి. ఇది ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందింది. రోజుకు ఒక యాపిల్ ని తినడం వల్ల బరువు పెరగకుండా నిరోధించవచ్చు. మీ రక్తంలో చక్కెర స్థాయిని ఈజీగా నిర్వహించవచ్చు.ఇది మీ థైరాయిడ్ గ్రంధిని యాక్టివ్ గా ఉంచుతుంది. థైరాయిడ్ గ్రంధి బాగా పనిచేయడానికి ఆపిల్ సహకరిస్తుందని పలు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. యాపిల్స్ కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా ఈజీగా తగ్గిస్తాయి. అలాగే మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బుల నుంచి రక్షిస్తాయి.