మగవారిలో శుక్రకణాభివృద్ధికి ఈ ఆహారాలు తింటే చాలు..!

Divya
పెళ్లయిన తర్వాత చాలామంది మొదటి సంవత్సరంలోనే తమకంటూ ఒక సంతానం కలగాలి అని కోరుకుంటూ ఉంటారు.కానీ కొన్నిసార్లు స్త్రీలలో సంతాన సమస్యలు కలిగి ఉండటం, మరియు ఇంకొంతమంది మగవారిలో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండడం వంటివి జరుగుతూ ఉంటాయి.దీనికి కారణం మగవారు ఒకే చోట ఎక్కువసేపు కూర్చొని పని చేయటం,లాప్టాప్, పీసీలను వాడటం,జీన్స్ టైప్ ఆఫ్ మెటీరియల్ ధరించడం వంటి తప్పులు చేయడం వల్ల,వారిలో క్రమంగా స్పెర్మ్ కౌంట్ తగ్గుకుంటూ వస్తుంది.అలాంటి వారికి ఈ సమస్య తగ్గాలంటే కొన్ని రకాల ఆహారాలు ఇవ్వడంతో,తొందరగా వారిలో శుక్రకణాభివృద్ధి జరుగుతుందని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.అలాంటి పదార్థాలు ఏంటో మనము తెలుసుకుందాం పదండి..

గుమ్మడి గింజలు..

గుమ్మడి గింజలను రోజూ తీసుకోవడంతో స్పెర్మ్ కౌంట్ పెరుగడానికి కావాల్సిన జింక్ పుష్కళంగా లభిస్తుంది.అంతే కాక స్పెర్మ్ యొక్క నాణ్యతను పెంచడంలో కూడా సహాయపడుతుంది.దీని కోసం గుమ్మడి గింజలు వేయించి, వాటికి సరిపడా ఖర్జూరాలను తీసుకొని,బాగా మెత్తగా మిక్సీ పట్టి,లడ్డు లాగా తయారు చేసుకొని,ఒక గాజు గ్లాస్ లో స్టోర్ చేసుకోవాలి.ఈ లడ్డుని రోజు రాత్రి పడుకోబోయే ముందు తినడం చాలా మంచిది.

ఆరెంజ్..

ఆరెంజ్ లను తరుచూ తీసుకోవడంతో విటమిన్ సి పుష్కలంగా లభించి,స్పెర్మ్ కౌంట్‌ను పెంచడంలో కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి.మరియు రోగనిరోధక శక్తిని పెంచుతుంది కూడా..

చాకోలెట్..

మగవారు స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉందని బాధపడేవారు, స్పెర్మ్ కౌంట్ మరియు, వాటి నాణ్యతను పెంచుకోవడానికి, డార్క్ చాక్లెట్ తీసుకోవడం చాలా మంచిది.ఇందులోని అర్జినైన్ అనే మూలకం లభించి, ఇది స్పెర్మ్ కౌంట్‌ను పెంచడంలో సహాయపడుతుంది.

దానిమ్మ జ్యుస్..

తరుచూ దానిమ్మ జ్యుస్ తీసుకోవడం వల్ల,అందులోని యాంటీఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా లభిస్తాయి.దానిమ్మ జ్యుస్ లో టెస్టోస్టెరాన్ స్థాయిని పెంచే గుణం ఉండటంతో,ఇది స్పెర్మ్ కౌంట్‌ను పెంచుతుంది.

సాల్మన్ ఫిష్..

వారానికి రెండు సార్లు సాల్మన్ ఫిష్ తీసుకోవడంతో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కళంగా లభిస్తాయి.ఇవి స్పెర్మ్ కౌంట్‌ను పెంచడానికి సహాయపడతాయి.ఇంకెందుకు ఆలస్యం జెన్స్ ఈ ఆహారాలు తీసుకోవడం అలవాటు చేసుకోండి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: