ఈ స్వీట్ తింటే చాలా బలంగా ఉంటారు?

Purushottham Vinay
శనగపిండితో మనం చాలా రకాల పిండి వంటకాలను ఇంకా అలాగే తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. ఈ శనగపిండితో చేసే తీపి వంటకాలు తినడానికి చాలా రుచిగా ఉంటాయి.తరచూ చేసే వంటకాలతో పాటు శనగపిండితో మనం  త్రిపాకాన్ని కూడా తయారు చేసుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక శనగపిండితో చేసే ఈ తీపి వంటకం ఆరోగ్యంతో పాటు చాలా రుచిగా ఉంటుంది. పైగా దీనిని కేవలం 20 నిమిషాల్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇక మీకు తీపి తినాలనిపించినప్పుడు రుచిగా, సులభంగా, చాలా తక్కువ సమయంలో మీరు ఈ తీపి వంటకాన్ని తయారు చేసుకుని తినవచ్చు. ఇక నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఈ చక్కటి తీపి వంటకాన్ని ఎలా తయారు చేసుకోవాలి? ఇంకా దాని గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.దీని తయారీ విధానం విషయానికి వస్తే ..ముందుగా పటిక బెల్లాన్ని దంచి దాన్ని జార్ లో వేయాలి. తరువాత దీనిని మెత్తని పొడిలా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తరువాత ఇదే జార్ లో జీడిపప్పు వేసి కొద్దిగా పలుకులు ఉండేలా మిక్సీ పట్టుకోవాలి.



ఆ తరువాత కళాయిలో శనగపిండి వేసి చిన్న మంటపై కొద్దిగా రంగు మారే దాకా కలుపుతూ వేయించాలి. ఆ శనగపిండి వేగగానే స్టవ్ ఆఫ్ చేసి పిండిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ పిండి చల్లారిన తరువాత పాలు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఆ తరువాత స్టవ్ ఆన్ చేసి మధ్యస్థ మంటపై దగ్గర పడే దాకా కలుపుతూ ఉడికించాలి. శనగపిండి మిశ్రమం దగ్గర పడిన తరువాత పటిక బెల్లం పొడి ఇంకా కుంకుమ పువ్వు నీళ్లు పోసి కలపాలి.ఆ తరువాత కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉడికించాలి. ఈ మిశ్రమం కళాయికి అంటుకోకుండా నెయ్యి పైకి తేలే దాకా ఉడికించిన తరువాత మిక్సీ పట్టుకున్న జీడిపప్పు పొడి వేసి కలపాలి.దీనిని మరో 5 నిమిషాల పాటు చక్కగా కలుపుతూ ఉడికించి స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి. ఆ తరువాత దీనిని గిన్నెలోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బాగా రుచిగా ఉండే త్రిపాకం తయారవుతుంది. దీనిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మేలు కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: