
కిలో జీడిపప్పు 15 రూపాయలే.. ఎక్కడంటే?
ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్లో జీడిపప్పు ధర దాదాపు 800 రూపాయలకు పైగానే ఉంది. దీంతో ఇక జీడిపప్పు చాలా కాస్లి అయినప్పటికీ కొంతమంది ఇక ఆరోగ్యం కంటే ఇంకా ఏది ఎక్కువ కాదు అని భావించి ఇక జీడిపప్పును కొనుగోలు చేస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. ఇక మరి కొంతమంది సామాన్యులు ఈ జీడిపప్పు ధర తగ్గితే బాగుండు అని అనుకుంటూ ఉంటారు. అయితే ఇక ఇప్పుడు జీడిపప్పు ధర ఏకంగా 15 రూపాయలు ఉంది అంటే ఎవరైనా నమ్ముతారా ఊరుకోండి బాసూ జోకులు వేసినా కాస్త నమ్మే విధంగా ఉండాలి అని అంటారు ఎవరైనా.
కానీ నిజంగానే ఇక్కడ ఏకంగా కిలో జీడిపప్పు కేవలం 15 రూపాయలకే మార్కెట్లో అమ్ముతున్నారు. అయితే ఇది మన రాష్ట్రంలో కాదు జార్ఖండ్ లోని జామ్తాడ జిల్లాలో. నాలా అనే గ్రామంలో జీడిపప్పు కిలో కేవలం 15 నుంచి 40 రూపాయలకే అమ్ముతూ ఉండటం గమనార్హం. ఇందుకు కారణం ఏళ్ల తడబరి కరువుతో కొట్టుమిట్టాడిన ఆ ప్రాంతాన్ని అనేక పరిశోధనల తర్వాత కేవలం జీడిపప్పు తోటలకే అనుకూలంగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో అక్కడి రైతులు అందరూ కూడా ఇక జీడిపప్పు తోటలను వేస్తూ ఉన్నారు. దీంతో ఇక రోడ్ల మీద కుప్పలుగా పోసి మరి జీడిపప్పును తక్కువ ధరకే అమ్ముతూ ఉండడం గమనార్హం.